స్టార్ క్రికెటర్ తో రాశి ఖన్నా నిశ్చితార్ధం.. పెళ్లి ఎప్పుడంటే?

తెలుగు ఇండస్ట్రీలో రాశీ ఖన్నాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అక్కినేని ఫామిలీ మూవీ అయిన మనం సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా తొలిసారి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా, అందులో చిన్న పాత్రలో నటించినప్పటికీ తెలుగు ఆడియన్స్ దృష్టి తనపై పడేలా చేసుకుంది. ఆ తరువాత శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే సినిమాలో హీరోయిన్ గా నటించి కుర్రకారు మనసు దోచిన రాశి ఖన్నా, ఆ తరువాత నుండి మెల్లగా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. ఇక ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తో ఆమె నటించిన సుప్రీం, ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ, వరుణ్ తేజ్ తో చేసిన తొలిప్రేమ లాంటి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ తో చేసిన ప్రతి రోజు పండగే, వెంకటేష్ నాగచైతన్య ల కలయికలో వచ్చిన వెంకీ మామ సినిమాలతో హీరోయిన్ గా ఆమెకు సూపర్ సక్సెస్ ని అందించి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Image result for రాశిఖన్నా పెళ్లి

ఈ విషయాలన్నీ ఇలా ఉంటె ఇప్పుడు రాశిఖన్నా పెళ్లికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కొద్దిరోజుల క్రితం రాశి ఖన్నా, ప్రముఖ క్రికెటర్ బుమ్రాల మధ్య ప్రేమాయణం సాగుతోందని, అలానే వారిద్దరూ కూడా డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే రాశికన్నా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నిజానికి అతనిని నేను ఇప్పటివరకు కలవలేదని, ప్రచారం అవుతున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లని కొట్టిపారేయడం జరిగింది. దాంతో ఆ వార్తలకు పులుస్టాప్ పడింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త హల్చల్ చేస్తుంది. రాశిఖన్నా పెళ్లిని ఆమె ఇంట్లో వారు ఒక క్రికెటర్ తో కుదిర్చారని, అలానే రెండు రోజుల క్రితం రెండు ఫ్యామిలీలు హాజరవగా సీక్రెట్ గా నిశ్చితార్ధం వేడుక కూడా జరిగిపోయిందని సమాచారం. పెళ్లి మాత్రం ఈ ఏడాది చివర్లో పెట్టుకున్నారని, అందువలన పెళ్లి విషయం ఇప్పుడే రివీల్ చేయడం కంటే సరిగ్గా పెళ్లి దగ్గర పడిన సమయంలో చెపుదామని అనుకుంటున్నారట. ఈ లోపు రాశి కమిట్ అయిన సినిమాలు కూడా పూర్తి అవుతాయి కాబట్టి ఏడాది చివర్లో చెప్పడమే కరెక్ట్ అని ఇరు కుటుంబాల వారు ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.

అయితే ఇక్కడ క్రికెటర్ అంటే బుమ్రా అని వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన వార్తలు నిజమే అని అంటున్నారు. ఈ విషయం మాత్రం రాశి కుటుంబంలోని కొందరు సన్నిహితుల నుండి బయటకు వచ్చినట్లు సమాచారం. నిజానికి దీనిపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేకపోవడంతో రాశి ఫ్యాన్స్ చాలా మంది దీనిని, తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఖండిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిశ్చితార్థం నిజంగానే జరిగిందని సమాచారం. మరి ఇది నిజమో అబద్దమో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే..

Content above bottom navigation