స్టేజ్ పైనే ముక్కు అవినాష్ చెంప చెళ్లుమనిపించిన వర్షిణి…

122

బుల్లితెరపైన యాంకరింగ్ రంగానికి గ్లామర్ సొగసులద్దింది అనసూయ, రశ్మిలు అయితే దానిని మరింత ముందుకు తీసుకెళ్లింది మాత్రం వర్షిణి అనే చెప్పాలి. స్వతహాగా మోడల్, సినిమా రంగం నుండి బుల్లితెరకి వచ్చిన నటి. దాంతో స్కిన్ షో చేయడానికి రెడీగా ఉంటుంది. పటాస్ షోలో బోల్డ్ పంచులే కాదు, బోల్డ్ గా కనపడటానికి కూడా వెనకాడడం లేదు. ఒకట్రెండు సినిమాల్లో నటించిన వర్శిని పెళ్లిగోల వెబ్ సిరీస్ తో బాగా ఫేమస్ అయింది. తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది. యాంకరింగ్ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకుంటూ యాంకర్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం పటాస్ షోకి యాంకరింగ్ చేస్తుంది.

ఆ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడి పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులే ఎక్కువగా ఉంటాయి. ఇంకా పండగ స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఆకట్టుకుంటుంది వర్షిణి.పటాస్ షో నుండి రవి, శ్రీముఖిలు తప్పుకున్న విషయం తెలిసిందే. వాళ్ల స్థానంలో చంటి, వర్శిని ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. చలాకి చంటితో కలిసి బోల్డ్ పంచులు మొహమాటం లేకుండా వేసేస్తుంది. మొన్నీమధ్య ఒక స్టూడెంట్ బుగ్గలు కొరికిన విషయంలో నెటిజన్లు వర్శనిని వదలకుండా ట్రోల్ చేశారు. వర్శిని మాత్రం అవేం పట్టనట్టుగా, పట్టించుకోనట్టుగా ప్రవర్తిస్తుంది.

అయితే ఈ మధ్యనే ఇటీవల ముక్కు అవినాష్ చెంప పగలకొట్టి మళ్లీ ట్రోలర్స్ కి పని కల్పించింది. ఇంతకీ ముక్కు అవినాష్ ని ఎందుకు కొట్టిందంటే, పటాస్ షోలో అవినాష్, వర్శిణి ముందు లవ్ క్లాసెస్ అంటూ స్కిట్ లో భాగంగా వర్శిణితో కుళ్లు జోకులు వేస్తున్నాడు. వాటికి అవినాష్, షోలో పార్టిసిపెంట్స్, ఆడియన్స్ తో పాటు వర్శిణి కూడా ఎంజాయ్ చేసింది. వెంటనే అవినాష్ లవ్ క్లాసెస్ తర్వాత బెడ్రూం క్లాసెస్ ఉంటాయని కామెంట్ చేశాడు. అంతే వర్షిణి ఒక్కసారిగా అవినాష్ చెంప పగలగొట్టింది. అంతే ఒక్కసారిగా అవినాష్ షాక్ అయ్యాడు.

అవినాష్ తో పాటు అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా వర్షిణి కొట్టడం చూసి షాక్ అయ్యారు. అయితే ఆ సమయంలో వర్షిణి నవ్వుతూ ఉంది. నవ్వుతూనే చెంప చెల్లుమనిపించినందుకు అవినాశ్ మొదట షాక్ అయినప్పటికి, అసలు అక్కడ ఏం జరగనట్టు, అది కూడా స్కిట్ లో భాగమే అన్నట్టుగా ప్రవర్తించి అవినాశ్ స్కిట్ కంప్లీట్ చేశాడు. అయితే వర్షిణి స్కిట్ లో భాగంగా కొట్టలేదని, అవినాష్ అన్న మాటలకూ కొట్టిందని అక్కడ ఉన్న అందరికి అర్థం అయ్యింది. స్కిట్ కంప్లీట్ అవ్వగానే అవినాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వర్షిణి అలా కొట్టడం అవినాష్ అవమానంగా ఫీల్ అయ్యాడంట.

Content above bottom navigation