హీరో నితిన్ రియల్ స్టోరీ..

219

నితిన్ 1983 మార్చి 30 న తెలంగాణ రాష్టంలోని నిజామాబాద్ లో జన్మించాడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి, తల్లి లక్ష్మిరెడ్డి. ఇతనికి ఒక్క అక్క కూడా ఉంది. ఆమె పేరు నికితారెడ్డి. ఇక నితిన్ బాల్యం అంతా నిజామాబాద్ లోనే సాగింది. స్కూల్ ఎజుకేషన్ మొత్తం నిజామాబాద్ లో సాగింది. ఇక ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చాడు. రత్న జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ను కంప్లీట్ చేశాడు. అదే సమయంలో నితిన్ హీరోగా సినిమాలోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రైవేట్ ను తన డిగ్రీని కంప్లీట్ చేశాడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసేవాడు. అలాంటి సమయంలో అలా పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాను నైజాంలో సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూట్ చేశాడు. హీరో పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని నితిన్. నిజామాబాద్ లో తొలిప్రేమ సినిమా చుసిన నితిన్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. అదే సమయంలో నితిన్ వాళ్ళ ఇంటికి వెళ్లిన డైరెక్టర్ కరుణాకరన్ నితిన్ బాగున్నాడు. హీరోగా ట్రై చేస్తే ఛాన్సులు వస్తాయని చెప్పాడంట. అలా కరుణాకరన్ అన్న మాటకు హీరో అవ్వాలని నితిన్ డిసైడ్ అయ్యాడంట. ఇక ఛాన్సులు కోసం ఎక్కువగా తిరగాల్సిన అవసరం లేకుండానే నితిన్ కు హీరోగా ఛాన్స్ వచ్చింది.

ఇక నితిన్ సినీ కెరీర్ విషయానికి వస్తే… ఉదయ్ కిరణ్ హీరోగా నటించింది నువ్వునేను సినిమాకు తేజ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సినిమాను నైజాంలో సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూట్ చేశాడు. అప్పుడు నితిన్ ను చుసిన తేజ తన తర్వాత సినిమాలో నితిన్ ను హీరోగా పెట్టి సినిమా చేస్తా అని మాట ఇచ్చాడంట. అలా 2002 లో తేజ జయం సినిమాకు నితిన్ ను హీరోగా తీసుకున్నాడు. అందులో విలన్ గా ఇప్పటి హీరో గోపిచంద్ నటించాడు. ఇక ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తేజకు, నితిన్ కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా హిట్ అయినా తర్వాత నితిన్ వెనుతిరిగి చూసుకోలేదు. వెంటనే వివి వినాయక్ అనే కొత్త దర్శకుడితో దిల్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, మాస్ లో నితీన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రయోగాల జోలికి వెళ్ళాడు నితిన్. సంబరం అనే ఫామిలీ సినిమా, శ్రీ ఆంజనేయం అనే డివోషనల్ సినిమాలు తీసి ప్లాప్స్ మూటగట్టుకున్నాడు.అలాంటి సమయంలో ss రాజమౌళి చేతిలో పడ్డాడు. రాజమౌళి డైరెక్షన్ లో సై సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతేకాదు నితిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఈ సక్సెస్ ను కాపాడుకోలేకపోయాడు నితిన్. వరుసగా డిజాస్టర్ సినిమాలు తీసి ప్లాప్స్ మూటగట్టుకున్నాడు.

Image result for hero nithin

అల్లరిబుల్లోడు, దైర్యం, రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ, రెచ్చిపో,సీతారాముల కళ్యాణం, మారో లాంటి వరుస ప్లాప్ సినెమాలో నటించాడు. ఏకంగా 10 ఏళ్ళు హిట్ మొహమే చూడలేదు నితిన్,. అయినా ఎక్కడ కంగారు పడకుండా మరొక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పిన ఇష్క్ కథ చెప్పడంతో సొంతంగా నిర్మించాడు. సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత మళ్ళి హిట్ బాట పట్టాడు. ఆ తర్వాత చేసిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో హార్ట్ అటాక్ అనే కొత్తరకం సినిమాతో వచ్చాడు కానీ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. ఆ తర్వాత కొరియర్ బాయ్ కళ్యాణ్, చిన్నదానా నీకోసం అనే మరొక డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అఆ సినిమాలో నటించి హిట్ సాధించాడు. కానీ తర్వాత మళ్ళి లై, చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలు తీసి వరుసగా మూడు ప్లాప్ సినిమాలను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం భీష్మ అనే సినిమాలో నటించాడు. చల్ లాంటి హిట్ సినిమా తీసిన వెంకీ కుడుములు డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో, కృష్ణ చైతన్య డైరెక్షలో ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఇందులో దాదాపుగా రెండు సినిమాలో 2020 లో రిలీజ్ కానున్నాయి. ఇవి హిట్ అయ్యి నితిన్ మళ్ళి హిట్ బాట పట్టాలని కోరుకుందాం. ఇక నితిన్ కు ఫిబ్రవరి 14 వ తేదీన ఎంగేజ్ మెంట్ జరిగింది. తెలంగాణ రాష్టంలోని నాగర్ కర్నూల్ కు చెందిన శాలినిని పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళ పెళ్లి ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగనుంది. అలాగే ఏప్రిల్ 21 వ తేదీన హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. నితిన్, సినిమా కెరీర్, పర్సనల్ లైఫ్ బాగుండాలని కోరుకుందాం.

Content above bottom navigation