హీరో శ్రీకాంత్ తమ్ముడు కూడా హీరో అని మీకు తెలుసా?

హీరో శ్రీ‌కాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ్రీకాంత్ అనగానే మనకి ఠక్కున గుర్తొచ్చేవి, ఫ్యామిలీ హీరోగా ఆయన చేసిన సినిమాలు. ఫ్యామిలీ సినిమాల్లో ఎంతగా అలరించాడో అదే స్థాయిలో ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మ వంటి చిత్రాలలో కూడా వైవిధ్యమైన పాత్రల్లో తన నటనను నిరూపించుకున్నాడు. 1991లో పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమాతో నట జీవితాన్ని ప్రారంభించిన శ్రీకాంత్, ఇప్పటి వరకు దాదాపు 125కు పైగా సినిమాల్లో నటించారు. విలన్ పాత్రలు, హీరో పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడంతో విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక ఈయ‌న కుమారుడు రోషన్ కూడా నిర్మలా కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన శ్రీకాంత్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగించడంలో, తన ప్రతిభతో వరుస అవకాశాలు దక్కించుకోవడంలో స్టార్ హీరోగా సక్సెస్ అయ్యాడు.

అయితే సినీ ఇండస్ట్రీలో వారసత్వం ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు. సినీ ఇండ‌స్ట్రీలో వార‌స‌త్వం ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఒక పెద్ద స్టార్ హీరో కొడుకో, కూతురో, త‌మ్ముడో లేదా ఇంకో కుటుంబ స‌భ్యుడో రావ‌డం జ‌రుగుతూనే ఉంది. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రు స‌క్సెస్ అవుతార‌న్న గ్యారెంటీ ఖ‌చ్చితంగా లేదు. అలాంటి వారిలో శ్రీకాంత్ తమ్ముడు కూడా ఉన్నాడు. శ్రీకాంత్, తన త‌మ్ముడు అనిల్ ని కూడా సినిమా రంగంలోకి తీసుకుని వచ్చాడు. ఆయన ఒకే ఒక్క సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా పేరు ప్రేమించేది ఎందుకమ్మా. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నిర్మాతలు కూడా శ్రీకాంత్ తో సినిమాలు చెయ్యడానికి ముందుకు రాలేదు. శ్రీకాంత్ కూడా నిర్మాతగా మారి తమ్ముడితో సినిమా చెయ్యడానికి పెద్దగా దైర్యం చెయ్యలేదు. అందుకే అనిల్ హీరోగా కంటిన్యూ కాలేకపోయాడు.

అన్న స్టార్ హీరో.... త‌మ్ముడు అడ్ర‌స్ ఒక్క సినిమాకే ఘల్లంతు...!

అయితే ఎలాగైనా సినీ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుని నిర్మాతగా అవతారం ఎత్తాడు. నిర్మాతగా మారి తన అన్నయ్య శ్రీకాంత్ తో విరోధి అనే సినిమా నిర్మించాడు. సినిమా కథ మంచిగా ఉన్నా, కథనం బాగాలేకపోవడంతో ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దాంతో చాలా లాస్ వచ్చింది. ఆ దెబ్బతో నిర్మాత జాబ్ కు కూడా పులుస్టాప్ పెట్టేశాడు. శ్రీ‌కాంత్ లాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా అనిల్ స‌క్సెస్ కాలేక‌పోయాడు. ఆ త‌ర్వాత సినిమాల్లో అడ్ర‌స్ లేకుండా పోయారు. అయితే అనిల్ సినిమాలలోకి రాకముందు అమెరికాలో సాఫ్టవేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. ఇక ప్రస్తుతం అనిల్ దుబాయ్ లో హోటల్స్ నిర్వహిస్తూ మంచి పొజిషన్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Content above bottom navigation