హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..

69

విలన్ గా ఎంట్రీ ఇచ్చి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి చివరికి హీరోగా సెటిల్ అయ్యారు శ్రీకాంత్. ఏ నటుడైనా వంద సినిమాల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు.. కానీ.. చాలా చిన్న పాత్రలతో పరిచయమై.. విలన్ గా మెప్పించి.. ఆ తర్వాత హీరోగా రాణించి.. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ లో శెభాష్ అనిపించుకుని సెంచరీ కొట్టడం ఆషామాషీ కాదు. స్వయంకృషితో చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని శ్రీకాంత్ ఎదిగిన విధానం ఎంతో మంది అప్ కమింగ్ ఆర్టిస్టులకు ఇన్‌స్పిరేషన్.. ఆ రోజుల్లో అందరు కుర్రాళ్లలాగే శ్రీకాంత్ కూడా చిరంజీవి డ్యాన్సులు చూసి చిన్నప్పటి నుంచే సినిమా నటుడై పోవాలని ఫిక్స్ అయిపోయాడు. డిగ్రీ తర్వాత హైదరాబాద్ వచ్చి మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ మెగాస్టార్ చలవతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇక శ్రీకాంత్ ఫామిలీ విషయానికి వస్తే… మేక పరమేశ్వరరావు, ఝాన్సీ గార్లకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. అందులో రెండో కొడుకు శ్రీకాంత్. వీరి మచిలీపట్టణం దగ్గరలో ఉన్న మేకవారి పాలెం స్వస్థలం. అయితే శ్రీకాంత్ పుట్టకముందే శ్రీకాంత్ గారి నాన్న పరమేశ్వర రావు కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లారు. శ్రీకాంత్ కూడా గంగావతి లో జన్మించారు. అక్కడే బీకాం వరకు చదువుకున్న శ్రీకాంత్ సినిమా అంటే మక్కువతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిప్లమా చేశారు. పీపుల్స్ ఎన్ కౌంటర్ అనే చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్, తాజ్ మహల్ సినిమాతో హీరోగా మారిపోయారు. ఇక ఆ తర్వాత తన కెరియర్ లో వెనుదిరిగి చూడలేదు. వరుసగా హీరోగా హిట్స్ సాధించాడు. ఆ తర్వాత ఫామిలీ సినిమాలు తీసి ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర అయ్యాడు.

Image result for హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..

ఇక ఆమె చిత్రంలో తనతో పాటు నటించిన ఊహాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీకాంత్. వీరికి ముగ్గురు పిల్లలు. రోషన్, మేద, రోహన్. పిల్లలు ముగ్గురూ కూడా సినీ కళామతల్లి సేవలో మునిగారు. పెద్ద కొడుకు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మరికొన్ని మూవీస్ చేయబోతున్నాడు. రెండో కొడుకు రోహన్ ప్రభుదేవాతో కలిసి ఓ త్రిభాషా చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఇక కూతురు మేధ కూడా చిన్నారి రుద్రమదేవిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక మేథ గురించి లేటెస్ట్ గా తెల్సిన విషయం ఏమిటంటే ఈమె బాస్కెట్ బాల్ లో జాతీయ స్థాయి క్రీడాకారిణి గా రాణిస్తోంది. శ్రీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ లో భాగంగా స్వయంగా తన నట వారసుల గురించి చెబుతూ శ్రీకాంత్ తన కూతురు గురించి కొత్త విషయం చెప్పాడు. ‘నా కూతరు మేథ బాగా చదువుతుంది. చదువు తప్ప తనకు ఏ ధ్యాస లేదు. బాస్కెట్ బాల్ కూడా బానే ఆడుతుంది. నేషనల్ బాస్కెట్ బాల్ టీమ్ కి కూడా ఎంపికైంది’అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ, సినిమాల్లో కూడా నటిస్తున్న మేథ ను ఇండస్ట్రీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇక తన తల్లిదండ్రుల గురించి చెప్తూ.. తన కెరీర్ లో కానీ పర్సనల్ విషయాల్లో గానీ తన తండ్రి పరమేశ్వర రావు గారు చాలా సపోర్టు అందించాలని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శ్రీకాంత్. అంత సపోర్ట్ ఇచ్చిన ఆయన అనారోగ్యం కారణంగా ఇటీవలే మరణించారు. ఆయన మరణంతో శ్రీకాంత్ గారి కుటుంబంలో విషాదం నెలకొంది.

Content above bottom navigation