జాను మూవీలో యంగ్ శర్వానంద్ గా నటించిన ఈ కుర్రాడి గురించి ఎవరికీ తెలియని విషయాలు

సమంత అక్కినేని, శర్వానంద్ కాంబినేషన్లో వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాను. తమిళ్ సినిమా 96 కు రీమేక్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దిల్ రాజు ఈ సినిమాలు తెలుగులో నిర్మించగా, తమిళ్ 96 తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా తెరకెక్కించాడు. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ అందుకుంటూ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాలో సమంత, శర్వానంద్ ల కెమిస్ట్రీ ఎంత పండిందో, వారి స్కూల్ లవ్ స్టోరీలో నటించిన యంగ్ శర్వానంద్, సమంతల మధ్య కూడా అంతే కెమిస్ట్రీ పండింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటినుంచి యంగ్ శర్వానంద్ గా నటించిన ఆ కుర్రాడు ఎవరు అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. ఈ వీడియోలో యంగ్ శర్వానంద్ గా నటించిన యాక్టర్ గురించి, తనకి ఈ ఆఫర్ ఎలా వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

జానులో యంగ్ శర్వానంద్ గా నటించిన అబ్బాయి పేరు సాయి కిరణ్ కుమార్. ఇతను హైదరాబాద్ కు చెందిన కుర్రాడే. బీటేక్ పూర్తి చేశాడు. బీటెక్ చేసిన కూడా సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ కు ఇటు వైపుగా అడుగులు వేశాడు. అసలు సినిమా ఫీల్డ్ అంటే పరిచయం లేని కుటుంబం. అందుకే ఒక ఫెమస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. సినిమా ఛాన్సులు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఒక్క ఛాన్స్ రాలేదు. ఎట్టకేలకు దిల్ రాజు కంట్లో పడ్డాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే దిల్ రాజు గారి బ్యానర్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. జాను మూవీలో యంగ్ శర్వానంద్ కారెక్టర్ కోసం యాక్టర్స్ కావాలనే ప్రకటనను సాయి కుమార్ అక్క చూసి అప్లై చేయమని చెప్పిందట. తనకు వస్తుందో లేదో అనే డౌట్ తోనే అప్లై చేశాడంట. ఇక సాయి కిరణ్ ఫోటోలు చుసిన దిల్ రాజు, డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆ క్యారెక్టర్ కు సరిగ్గా సెట్ అవుతాడని ఆడిషన్స్ కు పిలిచారంట.

Image result for jaanu movie stills telugu

సాయి కిరణ్ అప్లై చేసిన కొన్ని రోజుల తర్వాత దిల్ రాజు ఆఫీస్ నుంచి ఫోన్ రావడం, ఆడిషన్స్ కు అటెండ్ అయ్యి, రెండు ఆడిషన్స్ ఇవ్వడం, అవి డైరెక్టర్ కు నచ్చడంతో జాను సినిమాలో చిన్నప్పటి శర్వానంద్ క్యారెక్టర్ కు సెలక్ట్ అయ్యాడట. ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద ప్రొడక్షన్ లో రావడంతో సాయి కిరణ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. తన లైఫ్ లో ఇండస్ట్రీకి యాక్టింగ్ వైపు వస్తానని అనుకోలేదని, కానీ మొదటి సినిమానే ఇంత పెద్ద బ్యానర్ లో రావడం, అది కూడా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సాయికిరణ్. సినిమా ఛాన్సులు వచ్చి, తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation