నేను అతడినే పెళ్లి చేసుకుంటా…అసత్య ప్రచారాలు ఆపండి.. మీడియాకు అనుష్క వార్నింగ్..

131

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే ముందు గుర్తుకువచ్చే పేరు అనుష్క. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి, టాప్ ప్లేస్ కు చేరుకుంది. దాదాపు దశాబ్దనర కాలంగా తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. దేవసేన, భాగమతి, జేజమ్మ.. ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ స్పెషాలిటీ. ఇంచుమించు అందరు స్టార్ హీరోస్ పక్కన నటించింది ఈ బ్యూటి. ముఖ్యంగా బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. గతంలో కూడా అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, మిర్చి లాంటి భారీ హిట్స్ అందుకుంది. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్పెషాలిటీ. అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాలో నటిస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ముఖ్య విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దాంతో తనపై వస్తున్న రూమర్స్ మీద అనుష్క స్పందించింది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో స్వీటీ పెళ్లి జరగబోతుందని, ఒక యువ క్రికెటర్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతుందని వస్తున్న వార్తల గురించి స్పష్టత ఇచ్చింది. అనుష్క మీడియాతో మాట్లాడుతూ… తన గురించి ఇలాంటి వదంతులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని చెప్పింది. తన పెళ్లి గురించి సోషల్, వెబ్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎవరితో ప్రేమలో పడలేదని, తన తల్లిదండ్రులు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయినా ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించేంత టైమ్ లేదు నాకు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తున్నా. ఇప్పుడు నా దృష్టి అంతా సినిమాల మీదనే ఉంది. సినిమా ఆఫర్స్ రానప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా. అప్పుడు కూడా మా అమ్మానాన్న ఏ అబ్బాయిని చూపిస్తారో అతనినే పెళ్లి చేసుకుంటా. నా పెళ్లి విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారని, ఇకనైనా అసత్య ప్రచారం ఆపాలని మీడియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

Image result for anuska

గతంలో అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ప్రభాస్, అనుష్క తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తాము స్నేహితులమేనని స్పష్టత ఇచ్చారు. ఆ తరువాత స్వీటీ ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఈ వార్తలు కూడా నిజం కాదని తేలిపోయింది. తాజాగా ఒక క్రికెటర్ తో అనుష్క ప్రేమలో పడిందని వార్తలు వస్తూ ఉండటంతో అనుష్క ఒకింత ఘాటుగానే తనపై వస్తున్న వార్తల గురించి స్పందించింది. అనుష్క పెళ్లి వార్తల గురించి స్పందించడంతో ఇకనైనా మీడియా అనుష్క గురించి తప్పుడు ప్రచారం ఆపుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation