పైకి ఎంతో అందంగా కనపడే సురేఖా వాణి జీవితంలోని విషాదం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

148

ముందుగా బుల్లితెరపై అక్కడక్కడా పలు టివి షోల్లో వ్యాఖ్యాతగా నటించి మంచి పేరు గడించిన సురేఖా వాణి, ఆ తరువాత మెల్లగా తన పరిధిని పెంచుకుంటూ ముందుకు సాగారు. ఆ తరువాత ఒక్కొక్కటిగా పలు షోల్లో అవకాశాలు అందుకున్న సురేఖ, ఆపై తెలుగు చిత్ర సీమకు నటిగా అరంగేట్రం చేసారు. విజయవాడకు చెందిన సురేఖకు మొదటి నుండి సినిమా రంగంపై మంచి ఆసక్తి ఉండడం, అలానే తన ఇంటర్ విద్య తరువాత అప్పట్లోనే లోకల్ ఛానల్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి పేరు సంపాదించడం జరిగిందట. ఇక కొన్నాళ్ల తరువాత బుల్లితెర నుండి వెండితెరకు ప్రవేశించిన తరువాత ఆమెకు అవకాశాలు బాగా రావడం ప్రారంభం అయ్యాయి.

Image result for సురేఖా వాణి

తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించిన సురేఖ వాణి, కొన్నేళ్ల క్రితం పలు యాడ్ ఫిలిమ్స్ తీసి మంచి పేరు సంపాదించిన డైరెక్టర్ సురేష్ తేజ ని వివాహం చేసుకున్నారు. కాగా వారికి సుప్రీత అనే కూతురు ఉంది. ఇక ఇటీవల అనారోగ్య కారణాల వలన ఆమె భర్త సురేష్ తేజ అకాల మరణం పొందారు. ఇక ఆ తరువాత మానసికంగా కొంత ఆవేదన చెందిన సురేఖ, అక్కడినుండి కూతురు సుప్రీతతో కలిసి తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సినిమా నటులు అంటే వారికి బోలెడు డబ్బు వస్తుంది, వారి జీవితాలు ఎంతో హ్యాపీ గా ఉంటాయని ప్రజలు అనుకుంటుంటారని, అయితే తాము కూడా మిగతా మనుషుల వంటి వారమే అని, తమకు కూడా కుటుంబాలు, బంధాలు, ఎమోషన్స్, బాధ్యతలు వంటివి ఉంటాయని సురేఖ తన ఇంటర్వ్యూ లో ఇటీవల మాట్లాడుతూ చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి

తన భర్త సురేష్ మరణం తరువాత తనకు జీవితం ఎంతో అంధకారంగా అనిపించిందని, అయితే రాను రాను నా బిడ్డలోనే ఆయనను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాని అన్నారు. కూతురు సుప్రీత భవిష్యత్తు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ తన కోసం ఎంతటి ఇబ్బందిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధం అని ఆమె అంటున్నారు. అయితే ఆమె జీవితంలో భర్త పోయిన విషాదం నిండి ఉన్నప్పటికీ కూడా, ఆమె ఎప్పుడూ ఆ విషయాన్ని తమ ముందు బయటపెట్టేవారు కాదని, షూటింగ్ కి ఒకసారి వచ్చిన తరువాత అందరితో మాములుగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుని గుండె ధైర్యంతో ముందుకు సాగేవారని పలువురు నటులు ఆమె జీవితం గురించి అభిప్రాయపడుతున్నారు…..!!

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation