breakingnews : షూటింగ్ లో ప్రమాదం.. అక్కినేని అఖిల్ కు గాయాలు

79

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా వచ్చి హీరోగా నిలదొక్కుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాడు అక్కినేని అఖిల్. తన అన్న నాగ చైతన్య వరుసగా హిట్స్త మీద హిట్స్న తో దూసుకుపోతుంటే అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక్క హిట్డు కూడా కొట్టలేకపోయాడు. మొదటి చిత్రం ‘అఖిల్’ ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ పరంగా అఖిల్ మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం కూడా కమర్షియల్ హిట్ సాధించలేకపోయింది. దాంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో అఖిల్ ఎంచుకునే కథనాలు అంత బలంగా లేవని టాక్ వస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

తాజాగా ఇప్పుడు బొమ్మరిల్లుతో అద్భుతమైన విజయం అందుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్నాడట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం షూటింగ్ ఇప్పుడు షరవేగంగా జరుగుతుంది. ఇందులోని ఓ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఈ చిత్రంలో అఖిల్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో అఖిల్ గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఒక ఫైట్ చిత్రీకరణలో ప్రమాదవశాత్తు అఖిల్ చేతికి తీవ్ర గాయమైందని సమాచారం . దాంతో షూటింగ్ ను నిలిపివేశారు. అఖిల్ తిరిగి కోలుకునేంతవరకు షూటింగ్ వాయిదా వేసింది చిత్రయూనిట్. అయితే ఈ విషయం మీద చిత్ర యూనిట్ స్పందించింది. అఖిల్ గాయపడిన మాట వాస్తవమే. అతడ్ని హాస్పిటల్ కు తీసుకెళ్లిన విషయం కూడా నిజమే. కానీ ఈ ఘటన వల్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఆ సినిమా విడుదల వాయిదా పడిందంటూ వచ్చిన వార్తల్లో మాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.

Image result for akkineni akhil

ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతడి కుడి మోచేయికి చిన్న గాయమైంది. అయితే అది సినిమా ఆగిపోయేంత పెద్ద గాయం కాదని యూనిట్ స్పష్టంచేసింది. తిరిగి పదో తేదీ నుంచి అఖిల్ సెట్స్ పైకి వచ్చేస్తాడు. ఈ సినిమాను మే నెలాఖరుకు విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటికే షూటింగ్ 70శాతం పూర్తయింది. కాబట్టి అఖిల్ గాయం సినిమా విడుదల తేదీపై పెద్దగా ప్రభావం చూపించదు అని చిత్ర యూనిట్ తెలిపింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కెరీర్ లో ఇప్పటివరకు 3 సినిమాలు చేసిన ఈ హీరో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. అందుకే గీతాఆర్ట్స్2 బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతోనైన అక్కినేని అభిమానులను సంతోశాపరుస్తాడో లేదో..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation