అక్షయ్ కుమార్ భారీ విరాళం.

95

దేశంలో కరోనా కల్లోలానికి బ్రేకులు పడటం లేదు. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 900 దాటడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అలర్ట్ అయ్యాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలకు సూచనలిస్తూనే పలు నివారణ చర్యలు చేపడుతున్నాయి. అయితే ఇందులో తామూ భాగస్వామ్యం తీసుకుంటామని పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు.

సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

Akshay Kumar Donated 25 Crores Rupees To Pm Cares Fund For Covid ...

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం భారీ మొత్తం ఖర్చు చేస్తోంది. ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి కొన్ని ప్రభుత్వ విభాగాలు రేయింబవళ్లు కష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆర్థిక బలం చేరుకుర్చేందుకు మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొచ్చి భారీ విరాళాలు అందిస్తున్నారు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు.కరోనాపై పోరాటం చేయడానికి, దేశ ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వానికి పెద్దఎత్తున నిధులు అవసరమవుతున్నాయని పేర్కొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. సాయం చేసే శక్తి ఉన్న ప్రజల నుంచి విరాళాలను కోరారు. మీరిచ్చే ఒక్కో రూపాయి డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను పటిష్టం చేయడానికి, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

Actor Akshay Kumar Announces Rs 25 Crore Donation to the PM-CARES ...

దేశ ప్రధాని పిలుపు మేరకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి గొప్పమనసు చాటుకున్నారు. ఇప్పటిదాకా బాలీవుడ్ నటీనటులలో ఇంత భారీ మొత్తం ఎవరూ ప్రకటించకపోవడం విశేషం.అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించడంపై ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ అంతకుముందు తమ మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టింది. ఈ విరాళం ప్రకటించే ముందు తాను కూడా ఒకసారి ఆలోచించుకోమని అన్నానని, ఇంత మొత్తం ఇస్తే ఎలా?.. మనకి కూడా కొంత మనీ అవసరం కదా.. అని అక్షయ్‌తో చెప్పానని తెలిపింది.

అయితే తాను చెప్పిన ఈ మాటపై అక్షయ్ రియాక్ట్ అవుతూ.. ”నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఇప్పుడీ స్థాయిలో ఉన్నా కాబట్టి.. ఇలాంటి పరిస్థితులలో ఏమీ లేని వారి కోసం ఏదైనా సహాయం చేయకుండా ఎలా ఉండగలను” అని అన్నారని చెప్పింది ట్వింకిల్ ఖన్నా.ఏదిఏమైనా తన భర్త అక్షయ్.. కరోనా పట్ల పోరాటానికై 25 కోట్లు విరాళం ఇచ్చి తానెంతో గర్వపడేలా చేశారని ట్వింకిల్ ఖన్నా తెలిపింది. మరోవైపు అక్షయ్ కుమార్ ప్రకటించిన ఈ భారీ విరాళంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Content above bottom navigation