కరోనాపై పోరాటం: అల్లు అర్జున్ భారీ విరాళం.

224

ల్లు అర్జున్కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రభుత్వాలకు తమ వంతు సాయంగా టాలీవుడ్ హీరోలు వరసపెట్టి విరాళాలు ప్రకటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్ తదితర హీరోలు విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు వీరి ఖాతాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. మొత్తం రూ.1.25 కోట్ల సాయాన్ని బన్నీ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేరళకు కూడా అందజేయనున్నారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

‘‘కోవిడ్ 19 మహమ్మారి చాలా మంది జీవితాలను దెబ్బతీసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మానవత్వం కలిగిన మనిషిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ప్రజలకు కలిపి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నాను. మనందరి కలిసి పోరాడి, ఈ మహమ్మారిని త్వరలోనే నిర్మూలిస్తామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

అల్లు అర్జున్‌తో పాటు ఆయనకెంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ కూడా విరాళాన్ని అందజేశారు. సుకుమార్ రూ. 10 ల‌క్షల విరాళాన్ని ప్రక‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌హాయ నిధులకు చెరో రూ.5 ల‌క్షల చొప్పున విరాళం అందజేస్తానని ఆయన వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందజేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే, ‘అల వైకుంఠపురములో’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ సైతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు.

Content above bottom navigation