అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

241

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ కు అతనొక స్టైలిష్ స్టార్. యూత్ కు అతనొక ఐకాన్. సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం నుంచి వచ్చినా కూడా ఎలాంటి గర్వం కనపడదు. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా మాలీవూడ్ లోను కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. బాహుబలి1 ఈ సినిమా బీట్ చేసింది. బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తుంటే.. ఎవ్వరికైనా షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకుందాం.

Image result for allu arjun

అల్లు అర్జున్ దగ్గర ఉన్న విలువైన వస్తువుల విషయానికి వస్తే.. బన్నీకి 5 లగ్జరీ కార్లు వరకూ ఉన్నాయి. 64 లక్షలు విలువ గల రేంజ్ రోవర్ కారు ఒకటి కాగా, 80 లక్షలు విలువ గల బి.ఎం.డబ్ల్యు మరో కారు. వీటితో పాటు 88.58 లక్షల విలువగల ‘ఆడి ఏ7’ కారు, 1.2 కోట్ల జాగ్వార్ ఎక్స్.జె.ఎల్ కార్లు ఉన్నాయి. గతేడాది 2.3 కోట్ల రేంజ్ రోవర్ హై ఎండ్ కారుని కూడా కొన్నాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ ఇంటి ఖరీదు దాదాపు 100 కోట్ల రూపాయలంట. హైదరాబాద్ లో ఉన్న కాస్ట్లీ పబ్ లలో ‘హై లైఫ్’ ఒకటి. ఇది కూడా బన్నీ దే..దీని విలువ కూడా కోట్లలోనే ఉంది. కొద్ది రోజుల క్రితం ఓ కార్ వ్యాన్ ను డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. దీని ఖరీదు 7 కోట్లని తెలుస్తుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఈ మధ్యనే అల్లు అరవింద్ తన ఆస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచాడు. అల్లు అరవింగ్ పంచిన ఆస్తిలో అల్లు అర్జున్ కు 600 కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలుస్తుంది. గీత ఆర్ట్స్ ను పెద్ద కొడుకు వెంకటేష్ కు ఇచ్చాడు. అలాగే అల్లు అర్జున్ కూడా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ను అప్పజెప్పాడు. ఇక అల్లు శిరీష్ కు కొంత ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహలతారెడ్డి తన పుట్టింటి నుంచి దాదాపుగా 700 కోట్ల రూపాయల ఆస్తిని కట్నం కింద తీసుకొచ్చిందంట. అలాగే అల్లు అర్జున్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఫెయిల్ అండ్ లవ్లీ, OLX, జోయాలుకాస్, ఫ్రూటీ..ఇలా చాలా వాటికీ అల్లు అర్జున్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఒక్కొక్క కంపెనీ నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ ఒక్కొక్క సినిమాకు 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. వీటన్నిటిని చూస్తుంటే బన్నీ ఆస్థి రానున్న రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation