తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్‌కు గ్లామర్ సొగసులను అద్ది, టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది. అటు టీవీ తెరపైనే కాకుండా.. వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది. ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. అంతకు ముందు ‘క్షణం’ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం అనసూయ షోలు, సినిమాలతో యమ బిజీగా ఉంది. ఇలాంటి టైమ్ లో అనసూయ మీద సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేశారు కొందరు. అనసూయకు పలువురు నెటిజన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది.

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే సెలబ్రటీల్లో యాంకర్ అనసూయ ముందువరుసలో ఉంటుంది. ఎప్పుడూ తన రెగ్యులర్ అప్డేట్స్ పంచుకుంటూ, ఫ్రెష్ అండ్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ జబర్దస్త్ బ్యూటీకి ఆన్లైన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. అయితే ఇదే సోషల్ మీడియాలో అనసూయను పొగుడుతూ కామెంట్స్ పెట్టేవారు కొందరైతే, అదే ప్లాట్‌ఫామ్ పై ఆమెను బూతు కామెంట్లతో ఇబ్బంది పెట్టేవారు ఇంకొందరు ఉన్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ కామన్ అనుకొని ఇన్నిరోజులు కాస్త సైలెంట్‌గా ఉన్న అనసూయ, తాజాగా ఓ వీడియో ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చాలా ఏళ్లుగా తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేసినా పట్టించుకోలేదని, కానీ వదిలేస్తుంటే మితిమీరి పోతున్నారని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి తాను సీరియస్‌గా తీసుకోబోతున్నానని, ఇలాంటి కామెంట్స్ రిపీట్ అయ్యాయంటే ఎప్పుడూ లేని విధంగా సామూహికంగా అరెస్ట్ లు జరుగుతాయని పేర్కొంటూ ఫైర్ అయింది.
ఈ క్రింది వీడియోని చూడండి
గత కొన్నిరోజులుగా అనసూయపై సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ బాగా పెరిగాయి. ఈ మేరకు ట్విట్టర్ యాజమాన్యంతో పాటు, సైబర్ క్రైమ్ పోలీసులను కూడా సంప్రదించింది అనసూయ. తనపైన వచ్చిన కామెంట్స్ తాలూకు స్క్రీన్ షాట్స్ తీసి ఇలాంటి అకౌంట్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో లైవ్ వీడియో చేసిన అనసూయ, తనకు సపోర్ట్ చేసినవారికి థ్యాంక్స్ చెబుతూ, గతంలో కామెంట్స్ చేసిన వారికి ఛాలెంజ్ విసిరింది. తాను అవసరంగా కామెంట్స్ చేసేవారికి రిప్లై ఇచ్చి హైప్ ఇస్తున్నానని వార్తలు వస్తున్నాయని చూశానని చెప్పింది. అయినా హైప్ ఇవ్వడం ఏంటండి? హైప్ ఇస్తే హైప్ అయిపోతారా. దయచేసి కొంచెం బుద్ధి వాడండి. ఈ విషయంలో జబర్దస్త్ షోను లాగకండి అంటూ అనసూయ కోపంతో ఊగిపోయింది. తనపై వస్తున్న వల్గర్ కామెంట్స్ చేతున్న అందరినీ బయటకు లాగేస్తానని చెప్పింది అనసూయ. సామూహికంగా అరెస్ట్‌లు జరుగుతాయని చెప్పింది. ఈ లోగానే నాపై దరిద్రమైన కామెంట్స్ చేసిన వారు డిలీట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పింది అనసూయ. గతంలో అయితే తనపై వల్గర్ కామెంట్స్ చేస్తే కూడా.. పోనీలే వారి జీవితాలను ఎందుకు నాశనం చేయాలని ఆలోచించేదాన్ని.. కానీ ఊరుకుంటుంటే అవి శృతిమించి పోతున్నాయి. కాబట్టి ఇకనుంచి మాత్రం అస్సలు ఊరుకోను అంటూ స్ట్రాంగ్‌గా చెప్పేసింది జబర్దస్త్ బ్యూటీ అనసూయ. చూడాలి మరి మీద వల్గర్ కామెంట్స్ చెయ్యడం మానేస్తారో లేదో.
ఈ క్రింద వీడియో చూడండి: