ఆదికి అనసూయ భర్త భరద్వాజ్ వార్నింగ్.. ఏం జరిగిందో తెలుసా ..?

బుల్లితెర మీద బాగా పాపులర్ అయిన షోలు ఢీ అండ్ జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రముఖ చానల్ అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న రియాలిటీ షోని ఇంత కాలం సక్సస్ ఫుల్ గా రన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయమని చెప్పాలి. దాదాపు 7 ఏళ్ళు గా కొనసాగుతున్న ఈ రెండు రియాలిటీ షోస్ తో ప్రేక్షకులని బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అయితే ఇందులో దర్శకుల కష్టం ఎంత ఉందో ఈ షోస్ లో పాల్గొంటున్న యాంకర్స్, పార్టిసిపెంట్స్, టీం లీడర్స్ కష్టం, కృషి కూడా అంతే ఉంది. జనాలు అనుకునే పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ ని తీసుకుంటూ చాలా వల్గర్ కామెంట్స్ ని భరిస్తూ ఉండటం కూడా చాలా కష్టం.

ఇక ముఖ్యంగా జబర్దస్త్ లో అందరి స్కిట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. అందరికంటే కూడా హైపర్ ఆది స్కిట్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కేవలం ఆది స్కిట్స్ మాత్రమే చూసే అభిమానులు అయన ఉన్నారు. ట్రేండింగ్ లో ఉన్న విషయాలను తీసుకుని ఆది పంచులు వేస్తారు. చిన్న పెద్ద అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరి మీద పంచులు వేస్తూ నవ్విస్తుంటాడు. అతి తక్కువ కాలంలోనే ఆదికి పెద్ద గుర్తింపు వచ్చింది. చాలా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అలాగే రైటర్ గా కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. ఇక జబర్దస్త్ లో ఆది గురించి చెప్పాలంటే అనసూయతో చేస్తున్న ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి చెప్పాలి. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో పక్కన పెడితే ఆన్ స్క్రీన్ లో ఆది అనసూయ మీద వేసే పంచ్ లు, కామెంట్స్ కి జనాలు పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేస్తునారు. అంతేకాదు గత కొంతకాలంగా ఆది అనసూయ మీద కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక యూట్యూబ్ లో అయితే ఆది అనసూయ మధ్య ఏదో నడుస్తుందని, అందుకే ఆది ఏమన్నా అనసూయ ఒక్క మాట అనకుండా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుందని టాక్ నడుస్తోంది.

Image result for aadhi anasuya bharadwaj

అంతేకాదు ఈ మధ్య వీళ్ళ రొమాన్స్ ఇంకా దారుణంగానూ కనిపిస్తోంది. దాంతో జనాలు ఇద్దరి గురించి రక రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఒక వర్గం మాత్రం షోలో వీళ్ళ కెమిష్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అందుకే షో బాగా రన్ అవుతోందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య అనసూయ మీద ఆది వేసే సెటైర్స్ కి అనసూయ భర్త భరద్వాజ్ ఆదికి చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.. ఆ వార్నింగ్ కూడా ఆది స్టైల్లోనే సెటైరికల్ గా ఇచ్చాడంటా. మరీ ఎక్కువ చేస్తున్నావ్ ఆది, కాస్త తగ్గు లేదా తగ్గించుకో లేదా దించాల్సొస్తుంది అంటూ భరద్వాజా అన్నాడట. ఆది, అనసూయ మీద వస్తున్నా రూమర్స్ చూసి భరద్వాజ్ ఈ విధంగా స్పందించాడంట. మరి ఆది ఇప్పటి నుంచైనా కంట్రోల్ ఉంటాడా లేదా ఇంకా సీరియస్ వార్నింగ్ వచ్చే వరకు ఇలానే చేస్తాడా అనేది చూడాలి.

Content above bottom navigation