జబర్దస్త్‌ షోను అనసూయ వదిలేస్తుందా ?

102

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ఎంత పాపులర్ అయిందంటే గురువారం, శుక్రవారం వచ్చిందంటే పిల్లల దగ్గరనుంచి, పెద్దల వరకు జబర్దస్త్ కి అతుక్కుపోతున్నారు. అంతగా పాపులర్ అయింది. జడ్జీలుగా రోజా, నాగబాబు, యాంకర్లు అనసూయ, రష్మీ, టీమ్ లీడర్స్ అందరు కలిసి ఈ షోను టాప్ ప్లేస్ లో కూర్చోబెట్టారు. అయితే జబర్దస్త్ లో ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న నాగబాబు గారు ఆ షో నుంచి బయటకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తర్వాత జీ తెలుగులో అదిరింది పోగ్రామ్ కు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ షో చాలా రకాలుగా వార్తల్లోనే ఉంది. ఈ షో ఆగిపోతుందని కొందరు, కాదు కాదు పాత టీం లీడర్స్ అంతా వెళ్లిపోయి కొత్త వాళ్లు వస్తున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ షో నుంచి నాగబాబు వచ్చేసిన తర్వాతే ఇవన్నీ మొదలయ్యాయి. జీ తెలుగులో అదిరిందితో పాటు మరిన్ని ప్రోగ్రామ్స్‌లో కూడా నాగబాబు చేస్తున్నాడు. నాగబాబు తర్వాత కొందరు బయటికి వచ్చేస్తున్నారనే వార్తలు వచ్చినా కూడా చాలా మంది కమెడియన్లు అక్కడే ఉన్నారు. చంద్ర, ఆర్పీ మాత్రమే నాగబాబుతో బయటికి వచ్చేసారు. అయితే ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కూడా జబర్దస్త్ నుంచి బయటికొస్తుందనే ప్రచారం జరుగుతుంది.

Image result for anasuya

దీనిపై చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నా కూడా తను ఎక్కడికి వెళ్ళడం లేదని క్లారిటీ ఇచ్చింది అనసూయ. అయితే మరోసారి ఇలాంటి వార్తలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. హాట్ యాంకర్ అనసూయ భదర్వాజ్ ఇప్పుడు సినిమాలతో పాటు లోకల్ గ్యాంగ్స్.. ఇప్పుడు ప్రతిరోజూ పండగే అనే మరో షో కూడా చేస్తుంది. ఇన్నింటి మధ్య ఆమె షెడ్యూల్స్ కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. దాంతో జబర్దస్త్ షోకు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె కెరీర్‌కు బాటలు పడింది జబర్దస్త్‌లోనే. అక్కడే స్టార్ అయింది.. అక్కడ్నుంచే నటి అయింది.. హీరోయిన్ కూడా అయింది. ఇక ఇప్పుడు ఆమె జబర్దస్త్ కామెడీ షో నుంచి వెళ్లిపోతుందనే వార్తలు వస్తుండటంతో.. మరో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్‌పైనే భారమంతా పడుతుందేమో అనుకున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

మల్లెమాల మాత్రం తమ జాగ్రత్తల్లోనే ఉందని తెలుస్తుంది. వెళ్లిపోతున్న అనసూయ స్థానంలో మరో కత్తి లాంటి యాంకర్‌ ను తీసుకొస్తున్నారు. ఆమె మరెవరో కాదు శ్రీముఖి. బిగ్ బాస్ 3లో రన్నరప్ ట్రోఫీ అందుకున్న ఈమె.. రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకుంటుంది. ఈ తరుణంలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. అసలు అను కంటే ముందు ఈ షోలో శ్రీముఖికే ఆఫర్ వచ్చింది. అప్పట్లో ఈ ఛాన్స్ చేతులారా వదిలేసుకుంది శ్రీముఖి. తనపై వేసే పంచ్ డైలాగులు.. కుళ్లు జోకులు తట్టుకోవడం వల్ల కాదని వదిలేసుకుంది ఈ భామ. అయితే ఇప్పుడు శ్రీముఖి కూడా ఆరితేరిపోయింది. అందుకే ఇప్పుడు అనసూయ వదిలేసిన స్థానంలో శ్రీముఖి వచ్చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే అనసూయ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఓ రకంగా శ్రీముఖి కెరీర్‌కు కూడా ఇది మరో మెట్టు అవుతుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation