అనసూయ మీద ఇంత దారుణమైన ట్వీట్ ఎవరు చేసి ఉండరు..

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్‌కు గ్లామర్ సొగసులను అద్ది, టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది. అటు టీవీ తెరపైనే కాకుండా.. వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది. ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. అంతకు ముందు ‘క్షణం’ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం అనసూయ షోలు, సినిమాలతో యమ బిజీగా ఉంది. ఇలాంటి టైమ్ లో అనసూయ మీద సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేశారు కొందరు. అనసూయకు పలువురు నెటిజన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది.

Actress masala అనే అకౌంట్‌ ద్వారా ఓ నెటిజన్ అనసూయపై, సినీ నటి అనుష్కపై వల్గర్ ట్వీట్స్ పెట్టాడు. ఆ ట్వీట్‌ స్క్రీన్‌ షాట్స్ తీసి ఇలాంటి అకౌంట్స్‌ పై చర్యలు తీసుకోవాలని అనసూయ ట్విటర్ నిర్వాహకులను కోరారు. అయితే వారి నుంచి అనసూయకు ఊహించని పరిణామం ఎదురైంది. ‘‘మీరు ఇచ్చిన ఫిర్యాదుపై మేం దర్యాప్తు చేస్తాం. మాకు ఇందులో తప్పేమీ కనిపించడంలేదు. ఒకవేళ మీకు తప్పు ఉందని మీకు అనిపిస్తే ఏం జరిగిందో మాకు తెలియజేయండి’’ అని రిప్లై ఇచ్చారు.

ఈ క్రింద వీడియో చూడండి:

దాంతో ఇక అనసూయ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని అనుకున్నారు. తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్న ట్వీట్‌ ను, కంప్లైంట్ చేస్తే ట్విటర్ ఇచ్చిన రిప్లైను స్క్రీన్‌ షాట్ తీసి సైబర్ క్రైం పోలీసులకు పంపించారు. ‘డియర్ ట్విటర్ సపోర్ట్.. దయచేసి మీ రూల్స్‌ లో కొన్ని మార్పులు చేసుకోండి. ఇది ట్విటర్ వైలేషన్ కాకపోతే మరేంటి? దీనిని సైబర్ క్రైంగా పరిగణించకపోతే మీదే తప్పు అని చెప్పడానికి కూడా నేను వెనుకాడను. దయచేసి ఈ ట్వీట్స్‌ పై చర్యలు తీసుకోవడానికి సరైన అధికారులను ట్యాగ్ చేయాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులను కోరుకుంటున్నాను’ అని అనసూయ మండిపడ్డారు.

మొన్న కూడా ఎవరో తన ఫొటోను మార్ఫ్ చేశాడంటూ అనసూయ ఫైర్ అయ్యారు. దాని అసలు ఫొటోనే ఈ చీరకట్టులో ఉన్న ఇమేజ్ అని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు. ‘‘హలో!! నా ఇమేజ్‌ను మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఇమేజ్‌ను ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా నా మార్ఫ్‌డ్ ఇమేజ్‌ ను చూస్తే దయచేసి దాన్ని పోస్ట్ చేసిన ఫ్రొఫైల్ గురించి నాకు చెప్పండి’’ అని అనసూయ తన అభిమానులను కోరారు. ఇంతకీ, ఆ మార్ఫ్‌డ్ ఇమేజ్ ఏమిటో, దాన్ని ఎలా మార్ఫ్ చేశారో చేసినవాళ్లకే తెలియాలి.

క్రింద వీడియో చూడండి :

Content above bottom navigation