యాంకర్ అనసూయ రియల్ స్టోరీ..

161

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్‌కు గ్లామర్ సొగసులను అద్ది, టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది. అటు టీవీ తెరపైనే కాకుండా.. వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది. ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. అంతకు ముందు ‘క్షణం’ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అనసూయ ఈ స్థాయికి రావడానికి ఆమె ఎంతగానమో కష్టపడింది. చాలామందికి అనసూయ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలీదు. ఆమె భర్తతో సోషల్ మీడియలో చాలా సార్లు కనిపించినా.. తల్లిదండ్రులు మాత్రం ఎపుడు కనిపించలేదు. ఈ వీడియోలో అనసూయ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

Image result for యాంకర్ అనసూయ

అనసూయ 1979 లో నల్గొండ జిల్లా పోచంపల్లిలో జన్మించింది. వీళ్ళ ఫామిలీ పక్కా తెలంగాణ ఫామిలీ. తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త. సుదర్శన్ తన తల్లి పేరు అయినా అనసూయను తన కూతురికి పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. ఇక అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలనుకున్నారట. కానీ కుదరలేదు. అనసూయ 2008 లో బద్రుకా కాలేజ్ నుంచి ఎంబీఏ పట్టా పొందింది. ఆ తర్వాత ఐడీబీఐ బ్యాంక్ లో పనిచేసింది. అక్కడ కొన్నాళ్ల పాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఓ ప్రయివేట్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ లో చేరింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే సాక్షి న్యూస్ ఛానెల్‌లో యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది. అయినా మనకెందుకు వస్తుందిలే అనుకుంటున్న తరుణంలో ఆశ్చర్యకరంగా అనసూయను ఎంపిక చేశారు. అలా కొన్ని రోజులు సాక్షి న్యూస్ ఛానెల్ లో న్యూస్ యాంకర్ గా పనిచేసింది. ఇక కాలేజ్ డేస్ లో ఎన్ సీసీ లో పరిచయం అయిన సుషాంక్ భరద్వాజ్‌ తో ప్రేమలో పడిన అనసూయ అతడినే పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్న ఈ యాంకర్ భామకు శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. అనసూయ భర్త సుశాంక్ ఓ ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్.

ఈ క్రింది వీడియోని చూడండి

న్యూస్ రీడర్ గా కొన్ని రోజులు చేసిన తర్వాత ఆ జాబ్ నచ్చకపోవడంతో మానేసి, కొన్ని రోజులు ఇంట్లోనే ఖాళీగా ఉంది. అయితే సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ రంగంవైపు వెళదామని ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలోనే ఆమెకు నాగ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ పాత్ర అఫర్ వచ్చింది. అయితే ఆ సినిమా అనసూయకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అలాగే సినిమా ఛాన్సులు రావడం కూడా కష్టమైంది. అప్పుడే బుల్లితెర వైపు అడుగులు వేసింది. ముందు కొన్ని షోలు చేసిన కూడా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, మల్లెమాల ప్రొడక్షన్ లో వచ్చిన జబర్దస్త్ అనసూయ జీవితాన్నే మార్చేసింది. 2013 లో స్టార్ట్ అయినా ఈ పోగ్రామ్ అనసూయ కెరీర్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లింది. అనసూయ అందచందాలు, వాక్ చాతుర్యం జబర్దస్త్ షోకు ప్లస్ అయ్యాయి. అలాగే వెండితెర కమెడియన్స్ ఇందులో స్కిట్స్ చేసి నవ్వించడంతో జబర్దస్త్ షో నెంబర్ 1 షోగా పేరు తెచ్చుకుంది. ఈ షో చేస్తూనే మరికొన్ని షోలకు యాంకర్ గా చేసింది. భలే చాన్సులే, బిందాస్, మోడర్న్ మహాలక్ష్మి, డేట్ విత్ అనసూయ, జాక్ పాట్, బ్లాక్ బస్టర్..ఇలా ఎన్నో షోలకు యాంకర్ గా చేసింది. అలాగే డ్రామా జూనియర్స్, లోకల్ గ్యాంగ్స్ లాంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక అనసూయకు క్రేజ్ రావడంతో ఆమెకు పలు సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి.

Image result for యాంకర్ అనసూయ

సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం, విన్నర్, రంగస్థలం, F2, యాత్ర, మీకు మాత్రమే చెప్తా, కథనం లాంటి సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో చేసిన రంగమత్త పాత్రకు సినీ ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. ఈ పాత్ర అనసూయకు మంచి పేరు తీసుకొచ్చింది. అనసూయ పలు అవార్డ్స్ కూడా గెలుచుకుంది. క్షణం సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ గా సైమా, ఐఫా అవార్డ్స్ అందుకుంది. అలాగే రంగస్థలం సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సైమా, ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం అనసూయకు సినిమాల్లో చాన్సులు బాగానే వస్తున్నా తనకు ఇంత లైఫ్ ఇచ్చిన టెలివిజన్ రంగాన్ని మాత్రం వదులుకోనని చెబుతోంది. అనసూయ ఇలాగె తన యాంకరింగ్ తో, నటనతో మనల్ని ఇంకా అలరించాలని కోరుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation