కొత్త ఇల్లు కొనుకున్న యాంకర్ సుమ.. ఇంటి విలువ తెలిస్తే దిమ్మతిరుగుతుంది..

154

సుమ కనకాల యాంకర్ రంగంలో ఎంతో కాలంగా రాణిస్తూ తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఆమె గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. వయసు పైబడిన సుమ తన వాక్చాతుర్యంతో ఎన్నో సినీ ఈవెంట్లను, టీవీ ప్రోగ్రామ్స్ అవకాశాలను ఇప్పటికీ చేజిక్కించుకుంటుంది. అలాగే తన పాపులారిటీకి తగిన విధంగా ప్రతి ఈవెంట్ షో చేసినందుకుగాను ఆమెకి భారీ పారితోషికం లభిస్తోందని తెలుస్తోంది. కుర్రకారు యాంకర్ అనసూయనే ఒక్క ఈవెంట్ కి రూ.3 లక్షల పారితోషకం అందుకుంటుందంటే… సుమ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఊహించుకోవచ్చు. అలాగే సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల కూడా సినిమాల్లో అడపాదడపా నటిస్తూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు. ఈ విధంగా కోట్ల రూపాయలను సంపాదిస్తున్న దంపతులు తమ డ్రీమ్ హౌజ్ కలను నెరవేర్చుకున్నారు.

Image result for anchor suma

ప్రస్తుతం చిత్రసీమలో చాలామంది నటీనటులు తమ తమ సొంతిల్లు కొనుక్కునేందుకు, దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇల్లు కొనేయగా, అల్లు అర్జున్ కొత్త ఇల్లు నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఇదే బాటలో యాంకర్ సుమ దంపతులు కూడా ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారనే వార్త సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారింది. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఇంటి కోసం దాదాపు 10 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. తమకు నచ్చినట్లు వాస్తు ప్రకారం అన్నీ చూసుకుని భారీగా ఈ ఇంటిని తీసుకున్నారని, త్వరలోనే గృహప్రవేశం కూడా చేయనున్నారని టాక్ నడుస్తోంది. నిజానికి సుమ దంపతులు ఈ ఇల్లు తీసుకొని చాలా రోజులైందని, రాజీవ్ కనకాల ఫాదర్ దేవదాస్ కనకాల మరణం కారణంగా ఇన్నాళ్లు గృహప్రవేశం చేయలేదని సుమ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఇప్పుడు ఈ ఇంటి గృహ ప్రవేశం గురించి సుమ ఇంట్లో చర్చలు నడుస్తున్నాయని సమాచారం.

ఈ క్రింది వీడియో చూడండి

ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా సుమ, రాజీవ్ వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఒకప్పుడు ఉన్నంత సఖ్యత ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య కనిపించడం లేదనే వాదన కూడా వినిపిస్తున్న వేళ, కొత్త ఇల్లు తీసుకోవడంతో అంతా బాగానే ఉందని అర్థమైపోతుంది. పైగా భర్త గురించి ఈ మధ్య కొన్ని ప్రోగ్రామ్స్‌ లో సెటైర్లు కూడా వేస్తుంది సుమ. అంటే బాగున్నట్లే కదా అర్థం. త్వరలోనే ఈ ఇంటి ఓపెనింగ్ గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఏదేమైనా కూడా చాలా ఏళ్లుగా కష్టపడుతున్న దానికి ఇప్పుడు ఇలా ప్రతిఫలం దక్కిందన్నమాట. సుమ, రాజీవ్ కనకాల దంపతులు త్వరలోనే ఆ విలాసవంతమైన భవనంలోకి గృహ ప్రవేశం చేయనున్నారని తెలుస్తుండటం సుమ అభిమానుల్లో సంబరాలు నింపుతోంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation