యాంకర్ ప్రదీప్ భారీ విరాళం ఎంత ఇచ్చాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు

ప్రదీప్ మాచిరాజు టీవీ యాంకర్‌గా పరిచయమై తనశైలిలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో చిన్న చిన్న వేశాలు వేస్తూ అక్కడ కూడా తన లక్‌ను పరీక్షించుకుంటున్నాడు. అందులో భాగంగా ఆయన 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. యాంకర్ ప్రదీప్‌కు జీ తెలుగులో ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను టీవీ నంది పురస్కారం లభించింది. జీ తెలుగు లో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అది అలా ఉంటే ప్రస్తుతం కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం అంతా చిగురుటాకులా వణికిపోతోంది. ఈ కరోనా దెబ్బతో ఏరోజుకారోజు పనిచేసుకుని జీవిస్తున్న బడుగుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

దీంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాడానికి తనకు తోచిన సాయం చేయాడానికి ముందుకొచ్చాడు ప్రదీప్. దీనికి సంబందించి ఆయన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. తనకు తెలిసిన ఓ 60 కుటుంబాలకు నెలకు సరిపడ సరుకులు అందిస్తున్నానని పేర్కోన్నాడు. అంతేకాదు మనలో సాయం చేయగల స్థోమత ఉన్నవారు ముందుకొచ్చి తమ చుట్టుపక్కల వారికి తోచిన విధంగా సాయం చేయాలనీ కోరాడు. అలా ప్రదీప్ ఈ ఆపత్కాల పరిస్థితుల్లో తన మంచి మనసు చాటుకుని సామాజిక సృహా ఉన్న వ్యక్తిగా నిరూపించుకున్నాడు ఇది అందిరిలో చూడలేము.కాగా ఇక ఆయన నటించిన తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్ చేసిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?. సినిమా మార్చ్ 25న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో నీలినీలి ఆకాశం పాట యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Content above bottom navigation