అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ రియ‌ల్ స్టోరీ

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ చూడ‌గానే లావ‌ణ్యంతో క‌ట్టిప‌డేసే అంద‌మైన న‌టి చూపులు తిప్పుకోలేని అందం ఆమె సొంతం న‌ట‌న‌లో హోయ‌లే కాదు… మాట‌ల్లో ప‌ద‌నిస‌లు ప‌రుస్తుంది ఈ అమ్మ‌డు కుర్ర‌కారు గుండెల‌ని జారువిడిచేలా ఆమె అందం ఆక‌ట్టుకుంటుంది.సొగ‌సుచూడ‌త‌ర‌మా అనే పాట‌ని ఆమె న‌వ్వుల జ‌డి గుర్తు చేస్తుంది.అలాంటి అందాల తార అనుప‌మ రియ‌ల్ స్టోరీ ఈ రోజు తెలుసుకుందాం.

Image result for అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ చ‌లాకీ క‌లిగిన అమ్మాయి… మ‌న ప‌క్క ఇంటి అమ్మాయా అనేలా ఉంటుంది, తెలుగు త‌మిళ క‌న్నడ మ‌ళ‌యాళ చిత్రాల్లో న‌టించి ఆమె కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18 న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది… ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ లో ఉన్నతవిద్యను పూర్తి చేసింది.తరువాత సినిమాలలో నటన కోసం చదువును వాయిదా వేసుకుంది. మ‌ళ్లీ ఆలోచించి ఓ ప‌క్క డిగ్రీ చేస్తూ మోడ‌లింగ్ పై ఇంట్ర‌స్ట్ తో ఆ రంగం వైపు వెళ్లింది..

Image result for అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్

అనుప‌మ మలయాళ సినిమా ప్రేమమ్‌ లో నివిన్ పౌలీతో కలిసి నటించడం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా సూప‌ర్ స‌క్సెస్ గా విజయాన్ని సాధించింది…..తరువాత ఆమెకు మలయాళ చిత్రం జేమ్స్ అలైస్ లో అవకాశం వ‌చ్చింది… ఇక వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు తన్నుకు వచ్చాయి. వాటిలో సమంత, నితిన్ నటించిన అ ఆ సినిమాలో న‌టించింది ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టంది… అనుప‌మ మాతృభాష మలయాళమైనా తొలి తెలుగు సినిమా అ ఆలో సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తరువాత ఈమె మలయాళం నుండి తెలుగులో చిత్రాలు వ‌రుసగా చేసింది.ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. త‌ర్వాత ధనుష్ హీరోగా వ‌చ్చిన తమిళ సినిమా “కోడి”లో నటించింది. ఇది ఆమెకు తొలి తమిళ సినిమా… ఈ సినిమా కూడా స‌క్సెస్ అందించింది… అనుప‌మ 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌తో జంటగా నటించింది.. ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా ఆ ఏడాది మంచి హిట్ టాక్ తెచ్చిపెట్టింది.

Image result for anupama

తర్వాత అదే నెలలో విడుదలైన మలయాళ సినిమా “జొమొంతె సువిశేషంగళ్” అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈమె సరసన ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో “అందమైన జీవితం” అనే పేరుతో డబ్ చేశారు.. ఈ చిత్రం కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.2017 అక్టోబరులో విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో రామ్‌ పోతినేని సరసన నటించింది. త‌ర్వాత అనుప‌మ నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది… తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కొసమే అనే చిత్రంలో న‌టించి మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా న‌ట‌సార్వ‌భౌమ అనే క‌న్న‌డ చిత్రంలో న‌టిస్తోంది. ఇక గ‌తంలో మ‌ణిర‌త్నం హీరో కార్తీతో సినిమా ప్లాన్ చేశారు, అప్పుడు క‌థ న‌చ్చ‌డంతో ఆమె చేస్తాను అన్నారు, కాని త‌ర్వాత కొన్ని సీన్లు బోల్డ్ గా ఉన్నాయి అని చెప్ప‌డంతో సినిమా చేయ‌ను అని వెనుదిరిగింది. అలా మ‌ణిర‌త్నం సినిమాలో ఆమె న‌టించే అవ‌కాశం పొగొట్టుకుంది….అనుప‌మగ‌తంలో ప్రేమ‌లో ప‌డింది అని బ్రేక‌ప్ అయింది అని అంటారు, జీవితంలో బాగా అన్నీ విష‌యాలు తెలిసి వ‌చ్చాయి అంటుంది ఆమె.

ఈ క్రింద వీడియో చూడండి:

ఆమెకు వ‌చ్చిన అవార్డులు చూస్తే
11వ రాము కార్యత్ అవార్డును ప్రేమమ్ మలయాళం చిత్రానికి ఆమె సంపాదించుకుంది. ఉత్తమ నటిగా – తొలి చిత్రం ప్రేమమ్ మలయాళం లో అవార్డు పొందింది.సైమా అవార్డ్ ప్రేమమ్ చిత్రానికి అవార్డు పొందింది.2017లో అప్సర అవార్డ్స్ అ ఆ సినిమాకి గాను ఆమెని వ‌రించింది.ఐఫా ఉత్సవం ఉత్తమ సహాయ నటిగా కోడి చిత్రానికి తమిళంలో అవార్డు అందుకుంది.ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కారం కూడా ఆమె అందుకుంది.ఇలా చేసిన కొన్ని సినిమాలు అయినా ,అన్నీ ఆమెకు హిట్ టాక్ తెచ్చిపెట్టాయి, ఇలా మ‌రిన్ని మంచి సినిమాలు చేసి టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకోవాలి అని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation