నన్ను క్షమించరా..సుధీర్.! వాళ్ళే చేయమన్నారు.. సుధీర్ ఫ్యాన్స్ దెబ్బకి బాబా మాస్టర్ సంచలన నిర్ణయం

2645

ఢీ షోలో సుధీర్ చేసే రచ్చ.. సుధీర్‌పై సెటైర్లు వేస్తూ మిగతా వారు చేసే రచ్చ అందరికీ తెలిసిందే. అయితే ప్రతీసారి సుధీర్‌పై కౌంటర్లు వేస్తూ కించపరిచేలా స్కిట్స్ వేస్తూ కామెడీ చేస్తుంటారు. జబర్దస్త్ వరకు ఇది ఓకే అయినా ఢీ షోలోనూ అదే తంతు. అందరూ కలిసి సుధీర్‌ను పిచ్చోడిని చేస్తారు. పైగా బాబా భాస్కర్ వచ్చాక అది మరీ వేరే లెవెల్‌కు చేరింది. గత రెండు మూడు వారాలుగా సుధీర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటూనే వస్తున్నాడు. శేఖర్ మాస్టర్‌కు కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయనకు బదులుగా బాబా భాస్కర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాబా మాస్టర్ రావడంతో షో కూడా బాగానే ఆసక్తికరంగా మారింది. అయితే బాబా వేసిన సెటైర్లు ఒక్కోసారి శ్రుతి మించుతుంటాయి. అలా సుధీర్‌ను టార్గెట్ చేస్తూ ఉండటంతో అతని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

ఏం చేస్తున్నావ్.. అలా కూర్చుంటావా? ఇలా కూర్చుంటావా? ఎనర్జీ లేదురా? వేస్ట్ రా నువ్ అంటూ ఇలా ఏదో రకంగా సుధీర్‌ను కామెంట్ చేస్తూ వచ్చాడు. ప్రతీసారి ఇలానే ఉండటం, గతవారం కాస్త అదుపుతప్పి కామెంట్ చేయడంతో సుధీర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో బాబా భాస్కర్‌ను ఓ రేంజ్‌లో ఏసుకున్నారు. సుధీర్ ఢీ షోలో చేసే పని ఏంటి అంటూ మాస్టర్ రెచ్చిపోయాడు వీడు ఢీ షోలో చేసే పని ఏంటి? ఇందుకేనా వీడికి రెమ్యూనరేషన్ ఇచ్చేది అంటూ బాబా సెటైర్ వేశాడు. దీంతో అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఇక బాబాను ఓ రేంజ్‌లో తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అయితే ఇది చివరకు ఢీ టీం వద్దకు వెళ్లినట్టుంది.

ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సుధీర్ చేసిన పర్ఫామెన్స్‌కు బాబా ఫిదా అయ్యాడు. సుధీర్ బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. మామూలుగా అయితే సుధీర్ వేస్ట్ అంటారని అందరూ అనుకున్నారు కానీ ఈసారి మాత్రం మాట మార్చేశాడు. దానికి కారణం సుధీర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాబాపై చేసిన ట్రోలింగ్. ఇక బాబా సుధీర్‌ను మెచ్చుకోవడంతో అభిమానులు సంబరపడిపోతోన్నారు. మా అన్నను ఇకపై అలా కించపరచకండని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation