కేజీఎఫ్ హీరో చంపాలని చుశాడు.. ఎన్‍కౌంటర్ చేసిన పోలీసులు

కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ .. అయితే అంత పెద్ద స్టార్ హీరోని చంపేందుకు ఓ రౌడీ షీట‌ర్ ప్ర‌య‌త్నించాడు.. కాని అత‌ను తాజాగా మ‌ర‌ణించాడు.కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో కన్నడ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయిన హీరో యశ్. అలాంటి స్టార్ హీరోను చంపడానికి కర్ణాటకలో కుట్ర జరిగింది. యశ్..హత్యకు ప్లాన్ చేసిన వారిలో స్లమ్ భరత్ ప్రధాన నిందితుడు. 2019 మార్చి 7న.. స్లమ్​ భరత్ అతని అనుచరులు యశ్​ హత్యకు కుట్ర పన్నారు. అయితే వారి ప్లాన్‌ను ముందుగానే పసిగట్టిన పోలీసులు వారందరిని అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. ఆ తర్వాత భరత్ బెయిల్‌పై విడుదలయ్యాడు. స్లమ్ భరత్ కరుడుగట్టిన క్రిమినల్. హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్న మోస్ట్ డేంజరస్ నేరస్తుడని పోలీసులు చెప్పారు.

Crime : Notorious gangster Slum Bharath killed in police encounter in Bengaluru, Crime : ‘కేజీఎఫ్​’ హీరో హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్​కౌంటర్​…

ఈ. స్లమ్ భరత్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. తీవ్రమైన నేరచరిత్ర ఉన్న స్లమ్ భరత్‌ను కర్ణాటక పోలీసులు మట్టుపెట్టారు. అనేక నేరారోపణలతో పరారీలో ఉన్న స్లమ్ భరత్‌ను రెండురోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాద్ లో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెంగళూరు తీసుకొచ్చారు. ఓ కేసులో భాగంగా క్రైమ్ సీన్‌‌లో రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పారిపోయేందుకు యత్నించిన భరత్.. తమపై దాడికి యత్నించాడని, దీంతో ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు తెలిపారు.

స్లమ్ భరత్ తమపై కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. ఒక బుల్లెట్ ఎస్ఐకి తగిలిందని, మరో బుల్లెట్ వెహికల్‌కు తాకిందని వివరించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండటంతో ఎస్ఐకి ఎలాంటి హానీ జరగలేదన్నారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో భరత్ పొత్తి కడుపులోకి, కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని సప్తగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే స్లమ్ భరత్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు…తెల్లవారుజామున హీసరఘట్టలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

Content above bottom navigation