బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

తెలుగు కమెడియన్ బ్రహ్మానందం పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌ను ఏలిన ప్రముఖ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. ఒకానొక సందర్భంలో బ్రహ్మానందం లేకుండా తాము సినిమాలు చేయమని స్టార్ హీరోలు నిర్ణయించుకున్న పరిస్థితి ఏర్పడింది అంటే అయన స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్రహ్మానందం తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ స్థాయికి ఎదిగారు. ఓ సందర్భంలో ఏ కమెడియన్, ఏ యాక్టరూ లేనంత బిజీ బిజీగా బ్రహ్మానందం తన హవా కొనసాగించారు. డిమాండ్ ఎక్కువ కాబట్టి ఆయన సంపాదన కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోయిందని, ఆయన ఆస్తుల వివలు భారీగానే ఉండేది. అయితే ఒక ప్రముఖ ఛానెల్ బ్రహ్మానందం ఆస్తుల మీద సర్వే చేసి ఒక ఆర్థికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్ ప్రకారం.. బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ. 320 కోట్ల రూపాయలంట.

Image result for బ్రహ్మానందం

టాలీవుడ్ లో ఒకప్పుడు బ్రహ్మానందం హవా నడిచింది. అయన లేని సినిమా లేదు. ప్రతి రోజు ఏదో ఒక సినిమాలో నటించేవాడు. అలా బిజీ ఆర్టిస్ట్ గా ఉండేవాడు. తన డిమాండ్ ను బట్టి బ్రహ్మానందం కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకునేవాడంట. రోజుకు 3 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకునేవాడంట. అంత పెద్ద రెమ్యునరేషన్ తీసుకునే కమిడియన్ గాని, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గాని లేరు. అంత భారీ రెమ్యునరేషన్ అంటే ఆస్తులు కూడా బాగానే సంపాదించి ఉంటాడు. బ్రహ్మానందం వద్ద ఖరీదైన ఆడి ఆర్ 8, ఆడి క్యూ 7, మెర్సిడెజ్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయట. జూబ్లీహిల్స్‌లోని పోష్ ఏరియాలో బ్రహ్మానందానికి కోట్ల విలువైన ఇల్లు ఉందని, దాంతో పాటు కోట్ల రూపాయల విలువ చేసే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవరాలుగా బ్రహ్మానందం ఆస్తులు లెక్క చుస్తే 320 కోట్ల రూపాయలంట.

ఈ క్రింద వీడియో చూడండి

అలాగే, టాలీవుడ్ నుంచి అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించిన కమెడియన్లలో ఆయనే అగ్రస్థానం. బ్రహ్మానందం ఎక్కడా దురాబా ఖర్చు చేయరని, పొదుపు విషయంలో ఆయనను చూసి నేర్చుకోవాలని సీనీజనం చెబుతుంటారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అంతకు ముందే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్ర బస్సు’ చిత్రంతో 1000 సినిమాల మార్కును అందుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం హవా కొంత తగ్గింది అనే చెప్పుకోవాలి. అలాగే అయన ఆరోగ్యం కూడా ఈ మధ్య కొంచెం దెబ్బతింది. దాంతో చాలావరకు సినిమాలను తగ్గించాడు. బ్రహ్మానందం మళ్ళి సినిమాలలోకి వచ్చి మనల్ని ఇంకా అలరించాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి

Content above bottom navigation