టాలీవుడ్ లో ఉన్న బ్యాచిలర్స్ లో నితిన్ కూడా ఒకడు. ఈ హీరోకు పెద్దగా సినిమాలు లేకున్నా కూడా ఇంకా అవకాశాలు కోసం ఎదురు చూస్తే పెళ్ళికి దూరంగా ఉంటున్నాడు. గత నాలుగేళ్లుగా షాలిని అనే అమ్మాయిని ప్రేమిస్తున్న నితిన్, తన ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడంతో వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముంది, ఈ ఏడాది ఏప్రిల్ 15 న నితిన్ పెళ్లి డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు నితిన్.. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో యంగ్ హీరో నితిన్ ఒకడు. నూనూగు మీసాల వయసులోనే నితిన్ జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలతో హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తుంపు తెచ్చుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇష్క్’ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం నితిన్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఇక త్వరలోనే హీరో నితిన్ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
నితిన్ నాగర్‌కర్నూల్‌కు చెందిన సంపత్‌కుమార్, నూర్జహాన్ దంపతుల రెండవ కుమార్తె షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరి 15న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అలాగే దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో ఏప్రిల్ 15 న పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడట. దానికి కారణం కరోనా వైరస్. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా దెబ్బకు సినిమా వాళ్లు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే సినిమాలు వాయిదా పడుతున్నాయి.. షూటింగ్స్ ఆపేస్తున్నారు..

ఇప్పుడు నితిన్ పెళ్లి కూడా కరోనా కారణంగా వాయిదా పడేలా కనిపిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అరబ్ దేశాల్లో కఠినమైన ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు నితిన్ పెళ్ళిని కొన్ని రోజులుగా పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ముహూర్తం అది కాకుండా మరోటి కుదర్లేదంటే మాత్రం దుబాయ్ కాకుండా ఇక్కడే హైదరాబాద్‌లోని ఫామ్ హౌజ్ లో అదే ముహూర్తానికి నితిన్ పెళ్లి జరపాలని చూస్తున్నారు. ఏప్రిల్ 21న హైటెక్స్ లో ఘనంగా రిసెప్షన్ చేయనున్నారు. ఇక ఆయన సినిమా విషయానికొస్తే..వెంకీ కుడుమల దర్శకత్వంలో నటించిన ”భీష్మ” రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ప్రస్తుతం వెంకీ అట్లూరితో కలసి ”రంగ్ దే” అనే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమానే కాకుండా విభిన్న చిత్రాల దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటితో చేస్తున్నాడు. రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చదరంగం అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. అలాగే నితిన్ తనతో ఛల్ మోహన్ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. ఇవన్నీ కూడా ఈ ఏడాదే స్టార్ట్ చెయ్యనున్నాడు.