breakingnews : వెంకటేష్, ప్రభాస్‌తో సినిమాలు చేసిన సీనియర్ నిర్మాత కన్నుమూత..

79

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నటుడు శ్రీకాంత్ తండ్రి కన్నుమూశారు. అంతకు ముందు హాస్యనటుడు అలీ తల్లి మృతిచెందారు. గొల్లపూడి మారుతిరావుతో పాటు మరికొందరు ప్రముఖులు గత రెండు మూడు నెలల్లో కన్నుమూశారు. రెండు రోజుల క్రితం సీనియర్ నటుడు జనార్ధన రావు మృతిచెందారు. ఇప్పుడు టాలీవుడ్ మరో విషాదం చోటుచేసుకుంది..ప్రముఖ సీనియర్ నిర్మాత సి. వెంకట్ రాజు కన్నుమూశారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

శ్రీ గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన నిర్మాత సి వెంకట రాజు కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన చెన్నైలోని స్వగృహంలో మార్చ్ 8న మరణించారు. సోమవారం వెంకట్ రాజు అంత్యక్రియలు చెన్నైలో జరుగుతాయని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు కుటుంబ సభ్యులు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో స్వగ్రహంలోనే కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆదివారం వెంకట్ రాజు చెన్నైలో మృతిచెందినట్టు టాలీవుడ్ పీఆర్ఓ బీఏ రాజు ట్వీట్ చేశారు. శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్, గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై బి. శివరాజుతో కలిసి వెంకట్ రాజు సినిమాలను నిర్మించారు. గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌ పై వెంకటేష్ హీరోగా పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఘర్షణ లాంటి సినిమాలు నిర్మించారు వెంకట రాజు. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా వచ్చిన శ్రీమతి వెళ్లొస్తాకు కూడా ఈయనే నిర్మాత. దాంతో పాటు ఇంకా చాలా సినిమాలకు ప్రొడక్షన్ టీంలోనూ భాగస్వామిగా ఉన్నారు వెంకట రాజు. దాదాపుగా 16 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

Image result for నిర్మాత సి వెంకట రాజు

చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన మృతిపై తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతల మండలి వెంకటరాజుకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా వెంకటేష్ తనకు వెంకట రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.సోషల్ మీడియా వేదికగా తన నివాళి అర్పించారు. సోమవారం వెంకట్ రాజు అంత్యక్రియలు చెన్నైలో జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Content above bottom navigation