breakingnews : శ్రీకాంత్ ఇంట్లో ఘోర విషాదం.. కుప్పకూలిన కుటుంబసభ్యులు.. తరలివస్తున్న సినీప్రముఖులు..

88

ఈ మధ్య వరుసగా ప్రముఖులు చనిపోతున్నారు. అటు సినీ, ఇటు రాజకీయ రంగంలో ప్రముఖులు వివిధ కారణాల వలన కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం నెలకుంది. శ్రీకాంత్‌కు తండ్రి మేక పరమేశ్వరరావు (70) ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోన్న పరమేశ్వరరావు గత నాలుగు నెలల నుంచి స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

పరమేశ్వరరావు 1948 మార్చి 16న కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించారు. అనంతరం వీరి కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లింది. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. శ్రీకాంత్ కూడా గంగావతిలోనే జన్మించాడు. ధర్వాడ్‌లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్.. తర్వాత సినిమాలపై మక్కువతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లోమా చేశారు. ఇంటి పరిస్థితులు బాగాలేకపోయిన కూడా శ్రీకాంత్ ను ఎంకరేజ్ చేశాడు పరమేశ్వరరావు. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా నాన్న అని శ్రీకాంత్ చాలాసార్లు ఇంటర్యూలలో చెప్పాడు. ఆ తర్వాత సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించగా, ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమా ఛాన్స్ రావడంతో, ఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు శ్రీకాంత్..

Image result for srikanth father dead

కెరీర్ స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా, విలన్ గా మెప్పించాడు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోగా మారారు. సురేశ్ ప్రొడక్షన్‌‌లో వచ్చిన తాజ్‌ మహల్ సినిమా శ్రీకాంత్ కెరీర్‌ ను మలుపుతిప్పింది. తర్వాత రాఘవేంద్రరావు పెళ్లిసందడి ఆయనను కథానాయకుడిగా మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఆ తరువాత ఆమె, వినోదం, ప్రేయసి రావే, ఆహ్వానం, కన్యాదానం, ఖడ్గం, మహాత్మ, ఆపరేషన్ దుర్యోధన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో 100 సినిమాలు కంప్లీట్ చేసిన తక్కువ మంది హీరోలలో శ్రీకాంత్ ఒకడు. ఇక శ్రీకాంత్ తండ్రి మరణించాడు అన్న వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్..లాంటి హీరోలు శ్రీకాంత్ ఇంటికి చేరుకుని శ్రీకాంత్ తండ్రికి నివాళులు అర్పిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation