breakingnews : సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి మృతి

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గొల్లపూడి మారుతిరావుతో పాటు మరికొందరు ప్రముఖులు గత రెండు మూడు నెలల్లో కన్నుమూశారు. సీనియర్ నటుడు జనార్ధన రావుతో పాటు ప్రముఖ సీనియర్ నిర్మాత సి. వెంకట్ రాజు, తమిళ నటుడు, దర్శకుడు విసు కన్నుమూశారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి నిమ్మీ మృతిచెందారు. ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన ఆమె గత రాత్రి ముంబైలో కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి పోతే..

నటి నిమ్మీ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. వయసు మీద పడటం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిమ్మి వయసు 88 సంవత్సరాలు. ఆమె అసలు పేరు నవాబ్ బానో. నిమ్మి ఫిబ్రవరి 18వ తేదీ 1933న ఉత్తరప్రదేశ్‌ లోని ఫహేదాబాద్‌లో జన్మించింది. ఆమె తండ్రి అబ్దుల్‌ హకీమ్‌ మిలటరీ కాంట్రాక్టరు, తల్లి వహీదాబాయి మంచి గాయని, సినీ నటి. ఇక గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో భాదపడుతుంది. ఆరోగ్య సమస్యలు తీవ్రతరం కావడంతో ఆమెకి గత కొన్ని రోజులుగా మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారట. కానీ చివరకు ముంబైలోని సర్లా నర్సింగ్ హోమ్‌లో నిమ్మి మృతి చెందటం జరిగింది. దివంగత నటుడు రాజ్ కపూర్ నిమ్మిని వెండితెరకు పరిచయం చేశారు. ఆయనే నవాబ్ బానోను నిమ్మీగా మార్చడం జరిగింది.

Image result for నిమ్మి

రాజ్ కపూర్ మూవీ ‘బర్సాత్’తో సినీ గడపతొక్కిన ఆమె.. 1949 నుండి 1965 వరకు చాలా సినిమాల్లో నటించారు. నిమ్మీ 16 సంవత్సరాల పాటు సినిమాల్లో నటించారు. 1949 నుండి 1965 వరకు ఆమె సినిమాల్లో కనిపించారు. హిందీ చిత్రసీమలో అదృష్టవంతురాలైన నటీమణిగా నిమ్మి పేరుగాంచింది. 1963లో ఆమె చివరగా ‘లవ్ అండ్ గాడ్’ సినిమా చేసింది. ఆ సినిమా మాత్రం 23 ఏళ్ల తర్వాత 1986లో విడుదలైంది. ”ఆన్, ఉడాన్ ఖటోలా, భాయ్ భాయ్, కుందన్, మేరే మెహబూబ్” లాంటి చిత్రాలతో నిమ్మి ఫేమస్ అయింది. నిమ్మి మరణ వార్త తెలిసి బాలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రిషీకపూర్, మహేష్ భట్ సహా పలువురు బాలీవుడ్ తారలు నిమ్మి మృతి పట్ల తమ తమ సంతాపం తెలుపుతున్నారు.

Content above bottom navigation