breakingnews : సీనియర్ నటుడు మృతి.. ‘గబ్బర్ సింగ్’ ఇంట విషాదం

95

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గొల్లపూడి మారుతిరావుతో పాటు మరికొందరు ప్రముఖులు గత రెండు మూడు నెలల్లో కన్నుమూశారు. వారం రోజుల క్రితం సీనియర్ నటుడు జనార్ధన రావు మృతిచెందారు. అలాగే రెండు రోజున క్రితం ప్రముఖ సీనియర్ నిర్మాత సి. వెంకట్ రాజు కన్నుమూశారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

గబ్బర్ సింగ్ అంటే మనకు పవన్ కళ్యాణ్ సినిమా గుర్తుకు వస్తోంది. కానీ ఈ గబ్బర్ సింగ్ అనే పేరు.. అప్పట్లో అమితాబ్, ధర్మేంద్ర హీరోలుగా నటించిన ‘షోలే’ సినిమాలో విలన్ పేరు. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్రలో అమ్జద్ ఖాన్ తనదైన నటనతో మెప్పించాడు. ఈ సినిమా తర్వాత అమ్జద్ ఖాన్‌ గబ్బర్ సింగ్ పేరుతోనే పాపులర్ అయ్యాడు. ఆ సినిమాలోని ఆ క్యారెక్టర్ పేరుతోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక గబ్బర్ సింగ్‌గా ఫేమసైన బాలీవుడ్ నటుడు అమ్జద్ ఖాన్ సోదరుడు ఇంతియాజ్ ఖాన్ అనారోగ్యంతో కన్నుమూసాడు. ఈయన వయసు 77 ఏళ్ళు.

ఈయన అన్న బాటలోనే పలు సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించారు. అంతేకాదు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఈయన ముఖ్యంగా ‘హల్‌చల్’, ‘ప్యార్ దోస్త్’, ‘గ్యాంగ్’ సినిమాల్లో నటనతో ప్రేక్షకులను మెప్పించారు. గబ్బర్ సింగ్ ఫేమసైన అమ్జద్ ఖాన్.. తెలుగులో సింహాసనం, ప్రేమ యుద్ధం వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు.అలనాటి నటుడు జయంత్‌ కుమారుడే ఇంతియాజ్ ఖాన్. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఇతని భార్య కృతికా దేశాయ్ గుజరాతీ రంగస్థల, సినీ, టీవీ నటి. కుమార్తె పేరు అయేషా ఖాన్. ‘యాదోన్ కి బారాత్’, ‘ధర్మాత్మ’, ‘దయావన్’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఇంతియాజ్ ఖాన్ మృతిచెందినట్లు ట్రేడ్ అనలిస్ట్ అతుల్ మోహన్ ట్విట్టర్ ద్వారా ఖరారు చేశారు. ఇంతియాజ్ పాత ఫొటోను ట్వీట్ చేసిన అతుల్.. ‘‘విషాద వార్త.. హిందీ సినీ నటుడు ఇంతియాజ్ ఖాన్ ఈరోజు మృతి చెందారు.. ఆయన కుటుంబానికి దేవుడు శక్తిని, సామర్థ్యాన్ని కలిగించాలని ప్రార్థిద్దాం’’ అని అతుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Image result for ‘గబ్బర్ సింగ్’ ఇంట విషాదం

అలాగే, నటుడు జావేద్ జాఫెరి కూడా ట్విట్టర్ ద్వారా ఇంతియాజ్ ఖాన్ మృతిని ఖరారు చేశారు. ఆయన మృతిపట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోదరుడు అంజాద్ ఖాన్‌ తో ఇంతియాజ్ ఖాన్ దిగిన పాత ఫొటోను జావేద్ ట్వీట్ చేశారు. ‘‘వెటరన్ యాక్టర్ ఇంతియాజ్ ఖాన్ కన్నుమూశారు. ‘గ్యాంగ్’ సినిమాలో ఆయనతో కలిసి పనిచేశాను. గొప్ప నటుడు. అద్భుతమైన వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని జావేద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Content above bottom navigation