breaking news : షూటింగ్ లో ప్రమాదానికి గురైన స్టార్ హీరో అజిత్

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు. అంతేగాక హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోయే హీరోల్లో అజిత్ ఒకరు. అలాగే తెలుగులో మంచి మార్కెట్ ఉన్నటువంటి తమిళ హీరోల జాబితాలో అజిత్ పేరు ఉంటుంది. అజిత్ కుమార్ గతంలో నటించిన వేదాళం, వివేగం, విశ్వాసం చిత్రాలు తమిళ్ బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకున్నాయి. అయితే అజిత్ కూడా గత కొద్దికాలంగా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అజిత్ కుమార్ వాలిమై అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్ మరోసారి పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Image result for hero ajith

అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో అజిత్ గాయపడ్డాడు. ఓ యాక్షన్ సన్నివేశం కోసం బైక్ చేజింగ్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎలాంటి డూప్‌లు లేకుండా రియల్‌ స్టంట్‌ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ప్రమాదంలో ఆయన కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోలేదు. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు చికిత్స నిమిత్తం దగ్గర ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు. తమ అభిమాన హీరో ప్రమాదం నుండి బయటపడటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ తాలా అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌ లో ట్రెండింగ్‌లో ఉంచారు.

ఈ క్రింది వీడియో చుడండి

గతంలో కూడా చాలా సార్లు అజిత్ కి ఇలాంటి ప్రమాదాలు జరిగాయి కానీ, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాగె జరగడంతో అందరు కూడా కంగారు పడుతున్నారు. అజిత్ ను టెస్ట్ చేసిన డాక్టర్స్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్ని రోజులలో గాయాలు నయం అవుతాయని చెప్పారు. చికిత్స అనంతరం వైద్యులు కొంతమేర విశ్రాంతి అవసరమని అజిత్ కి సూచించారు. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు అజిత్ కోలుకునే వరకు కొంతకాలం పాటు చిత్ర షూటింగ్ ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ కోలుకున్న వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation