సింధు మీనన్ ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలుసా?

113

మీరు చందమామ సినిమా చూశారా.. చూసే ఉంటారులెండి, అందులో కాజల్ కాకుండా మరొక హీరోయిన్ కూడా ఉంది. ఆమెను సింధు మీనన్. నటి సింధు మీనన్ అందరికీ బాగా సుపరిచితమే. సింధు మీనన్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఆమె 1994 లో రష్మి అనే కన్నడ సినిమా లో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసింది. సింధు బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది. ఆమెకు కార్తీక్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. అతను మొదట్లో కన్నడ మ్యూజిక్ చానల్లో వీజేగా పనిచేసి తరువాత నటుడు అయ్యాడు. సింధు తన మాతృభాషయైన మలయాళమే కాక, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడగలదు. సింధు చిన్నతనంలోనే భరత నాట్యం లో శిక్షణ తీసుకున్నది. ఒకానొక భరత నాట్యం పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెగ్డే ఆమెను కన్నడ దర్శకుడు కె.వి. జయరాం కు పరిచయం చేశాడు. అలా ఆమె 1994 లో రష్మి అనే కన్నడ సినిమాలో నటించింది. తరువాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి.

Image result for sindhu menon

1999 లో 13 సంవత్సరాల వయసులో ప్రేమ ప్రేమ ప్రేమ అనే సినిమాలో కథానాయికగా నటించింది. తరువాత 15 సంవత్సరాల వయసులో తెలుగులో భద్రాచలం, తమిళంలో ఉత్తమన్, మలయాళంలో సముత్తిరం అనే సినిమాల్లో నటించింది. తెలుగులో చందమామ, భద్రాచలం, సిద్ధం చిత్రాల్లో.. తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది. సింధు యూకే లో స్థిరపడ్డ తెలుగు క్రైస్తవ కుటుంబానికి చెందిన డొమినిక్ ప్రభు అనే ఐటీ నిపుణుడిని ఏప్రిల్ 2010 న వివాహం చేసుకున్నది. వారికి ఓ కూతురు, ఒక కొడుకు. ప్రస్తుతం సింధూ తన పిల్లల అలనా పాలన చూసుకుంటూ లండన్ లోనే సెటిలై చక్కని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా గుడ్బై చెప్పిన సింధుకి మళ్లీ నటించాలనే ఆలోచన లేనట్లు సమాచారం. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని పొందిన సింధు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇలా సింధు మీనన్ తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవిస్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. అవేమిటి అంటే.. సింధు మీనన్ చనిపోయిందని వార్తలు వచ్చాయి. ఫామిలీ పరిస్థితుల వలన సింధు మీనన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ విషయం మీద ఆమెనే స్వయంగా మీడియాతో మాట్లాడారు. అసలు ఈ వార్త ఎలా మొదలైంది అంటే. సింధు అనే మరొక నటి సూసైడ్ ప్రయత్నం చేసుకోవటంతో మీడియా పొరబాటుబడింది. దాంతో సింధు మీనన్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చింది. నేను ఆత్మహత్య చేసుకోలేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. నేను న ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నా అని చెప్పింది. ఇక సింధు మీనన్ మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, మళ్ళి సినిమాలలో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె తన మనసు మార్చుకొని మళ్ళి నటించాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation