దిశ కేసులో హడావిడి చేసిన ఆర్జీవీ.. చెన్నకేశవులు భార్యకు చేసిన సాయం ఇంతేనా?

యావత్ దేశం మొత్తం కలకలం సృష్టించిన దిశ సంఘటన ఛాయలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ నలుగురు మృగాల వల్ల దిశ ఫ్యామిలీ మాత్రమే కాదు.. నేరస్థుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. కన్న కుమార్తెని కోల్పోయి దిశ కుటుంబం తల్లడిల్లుతోంది. నలుగురు దోషుల కుటుంబాలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నకేశవులు ఫ్యామిలీ పరిస్థితి మరీ దారుణం. చెన్నకేశవులు భార్య రేణుక ప్రస్తుతం గర్భవతి. అలాగే తండ్రికి యాక్సిడెంట్ అయ్యి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ కుటుంబాలకు మీడియా తాకిడి ఇప్పటికి కొనసాగుతోంది. అయితే దిశ ఎపిసోడ్ అయిన దగ్గర్నుంచి కూడా దీనిపై సినిమా ఎవరో ఒకరు తీస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. చివరికి అదిప్పుడు వర్మ చేతుల్లోనే పడింది. కొందరు వద్దని వారిస్తున్నా, ఆర్జీవీ మాత్రం పట్టించుకునేలా కనిపించడం లేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి ఫిక్సైపోయాడు. దిశా సంఘటనపై చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు.

Image result for rgv renuka

ఈ ప్రకటన చేసిన తర్వాత ఆర్జీవీ నిందితులలో ఒకడైనా చెన్నకేశవులు భార్య రేణుకను కలిశాడు. తన బంధువుల ద్వారా హైదరాబాద్ పిలిపించుకున్న ఆర్జీవీ దాదాపు గంటపాటు ఆమెతో చర్చించారు. ఆమెతో దిశ ఘటనకు ముందు ఏం జరిగింది.. చెన్నకేశవులు ఎలాంటి వాడు.. ఊళ్లో ఎలా ఉండేవాడు, వివాహం ఎప్పుడు జరిగింది, పోలీసులు ఎలాంటి విచారణ చేశారు వంటి విషయాలు తెలుసుకున్నారు. అలాగే వర్మ రేణుకకు ఆర్థిక సాయం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. వర్మ బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు, ఆ చెక్ తో రేణుక 5 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేమి నిజం కాదు. తాజాగా రేణుక ఓ మీడియాతో మాట్లాడుతూ వర్మ చేసిన సాయం, అతడు దిశా కేసుపై తెరకెక్కించే చిత్రం గురించి మాట్లాడింది. వర్మ చెన్నకేశవులు భార్యకు రూ.10వేలు ఆర్థికసాయం అందించాడట.

ఈ క్రింది వీడియోని చూడండి

రేణుక మీడియాతో మాట్లాడుతూ వర్మ చిత్రం గురించి స్పందించింది. వర్మ దిశా చిత్రంలో నీ భర్తని విలన్ గా చూపించబోతున్నారు.. దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. నా భర్త చనిపోయాడు. ఇక రాడు, అలాంటప్పుడు సినిమాలో ఎలా చూపిస్తే నాకేంటి. ముందైతే రాంగోపాల్ వర్మ సినిమా తీయని ఆ తర్వాత చూద్దాం అని రేణుక బదులిచ్చింది. వర్మ పిలుపు మేరకు ఆయన వద్దకు వెళ్ళాం అని రేణుక తెలిపింది. కారు ఛార్జీలు ఆయనే భరించారు. 10 వేలు సాయం చేశారు అని తెలిపింది. సినిమా గురించి తనకెలాంటి విషయాలు తెలియజేయలేదని రేణుక పేర్కొంది. ఇక రేణుకకు వర్మ కేవలం 10 వేల రూపాయలు సాయం చేశాడని తెలిసి నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంత హడావిడి చేసి ఆమెకు వర్మ చేసిన సాయం ఇదా అని కొందరు అంటే, ఇప్పటివరకు ఎవరు కూడా ఎలాంటి సాయం చెయ్యలేదు. కనీసం వర్మ ఆమాత్రం అయినా సాయం చేశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation