టైటిల్ అనౌన్స్ చేసిన చిరంజీవి కొర‌టాలకి ఫోన్ చేసి ఏమ‌న్నాడంటే

81

ఇటీవ‌ల చాలా వ‌ర‌కూ మెగాఈవెంట్ల‌కు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు.. ప‌లు ఆడియో వేదిక‌ల‌కు కూడా వెళుతున్నారు చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే, షూటింగ్ ఉండి కూడా ఆయన నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు నటించిన ఓ పిట్టకథ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు.. ఈ సందర్భంగా యువ నటీనటులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చిత్రసీమలో ఎలా ఎదగాలో వివరించారు. ఇండస్ట్రీ నుంచి ఏమి పొందారో దాన్ని తిరిగి ఇవ్వాలని తెలిపారు. క్రమశిక్షణతో మెలగడం ద్వారా ఉన్నత స్థానానికి ఎదగవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ ను ఊహించని విధంగా బయటకుచెప్పేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నానని చెప్పారు. దాంతో ఆడిటోరియంలో ఒక్కసారిగా కేకలు మిన్నంటాయి. వేదికపై ఉన్నవాళ్లు కూడా హర్షాతిరేకాలు చేస్తుండడంతో చిరు ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు చిరు . దర్శకుడు కొరటాల శివ టైటిల్ అనౌన్స్ చేసేందుకు పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఉంటాడని, ఇప్పుడు తానిలా టైటిల్ చెప్పేస్తే పాపం కొరటాల శివ ఏమనుకుంటాడో ఏమో అని చిరు విచారం వ్యక్తం చేశారు. సారీ శివా అంటూ చిరంజీవి సభాముఖంగా క్షమాపణలు తెలిపారు. అంతేకాదు ఈ ప్రోగ్రాం అయిన త‌ర్వాత మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ వార్త వ‌చ్చేసింది, ఇక చిరు త‌న నోటితో చెప్పిన టైటిల్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది..

Image result for chiru o pitta katha

అయితేచిరు ఇలా చెప్పేసిన త‌ర్వాత వెంట‌నే కొర‌టాల‌కి ఫోన్ చేశార‌ట‌, వెంట‌నే శివ సారీ అని ఫోన్లో చెప్పారట‌, అయితే దీనిపై శివ కూడా ఇక ఏమీ అన‌లేద‌ట‌, ఇంకెలాంటి విష‌యాలు చెప్ప‌కండి అన్నార‌ట‌, అయితే దీనిపై కొర‌టాల శివ చాలా ప్లాన్ చేశారు, ఈ టైటిల్ అనౌన్స్ చేయ‌డానికి పెద్ద ఈవెంట్ ప్లాన్ చేద్దామ‌ని అనుకున్నారు, కాని ఇలా చిరు ముందు చెప్పేయ‌డంతో ఇక సోష‌ల్ మీడియాలో టైటిల్ కూడా అంద‌రికి తెలిసిపోవ‌డంతో, వెంట‌నే ఈ ప్లాన్ ఆపేశారు, అంతేకాదు సింపుల్ గా చిన్న ఈవెంట్ లేదా ఓ ప్ర‌క‌ట‌న చేయాలి అని కొర‌టాల భావిస్తున్నార‌ట‌.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation