Breaking News: వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన దొరబాబు కి దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య

96

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా పాపులర్ అయ్యే స్కిట్ ఏదైనా ఉందంటే అది హైపర్ ఆది స్కిట్ అనే చెప్పుకోవాలి. హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే కామెడీ పంచ్ లు పేలిపోతాయి.. పొట్ట చెక్కలు కావాల్సిందే అంటారు. గత కొంత కాలంగా ఆయన కొంత మంది నటులను అనుకరిస్తూ కామెడీ చేస్తున్నాడు. హైపర్ ఆది టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైజింగ్ రాజు తర్వాత దొరబాబు. గతంలో దొరబాబు అడల్ట్ బీ గ్రేడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తావన హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబు పై పంచ్ లు వేస్తుంటాడు. కానీ ఇప్పుడు రియల్ గా కూడా ఇదే పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో జబర్ధస్త్ నటుడు దొరబాబు, పరదేశ దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మార్చి 3 వ తేదీ రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు విటుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిలో జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పరదేశి వీడియోలు తీయోద్దంటూ, తమను వదిలేయమంటూ పోలీసులను కాళ్లు పట్టుకుని మరీ బ్రతిమాలాడు. ఆ సమయంలో తమను వదిలేయాలని ప్రాదేయపడ్డట్టు సమాచారం. ప్రస్తుతం దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కేసు గురించి ఇప్పుడు దొరబాబు భార్య అమూల్య స్పందించింది.

Image result for dorababu wife

దొరబాబు భార్య అమూల్య తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చారు. అమూల్య టిక్‌ టాక్ చూసేవారికి సుపరిచితురాలే. అమూల్య, భర్త దొరబాబు అనేక టిక్ టాక్ వీడియోలు కలిపి చేశారు.ఈ క్రమంలోనే దొరబాబు ఇష్యు గురించి స్పందిస్తూ.. ‘ఓ వ్యక్తిని అపార్ధం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్ధం అవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి.

Image result for dorababu

అందుకే గతం మర్చిపోకూడదు’ అంటూ తన భర్త దొరబాబును ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. దీన్నిబట్టి భర్తకు అండగా ఉంటానని చెప్పకనే చెబుతుంది. అంతేకాదు తన మొగుడి తనకు తెలుసు.. ఎన్ని వచ్చినా కూడా తను నమ్మనని చెప్పకనే చెబుతుంది ఈమె. గతంలో కూడా యూ ట్యూబ్‌లో బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడు దొరబాబు. అయినా కూడా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందంటే దొరబాబు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి అంటూ ఆయన సన్నిహితులు కూడా సోషల్ మీడియాలో విమర్శించే వాళ్లను కోరుతున్నారు. ఏదేమైనా కూడా దొరబాబు భార్య పెట్టిన టిక్ టాక్ పోస్ట్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

Content above bottom navigation