దిల్ రాజు పెళ్లి చేసుకోబోయేది ఈ హీరోయిన్ నే..

96

తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజుకు తిరుగులేని ఇమేజ్ ఉంది. నిర్మాతగా ఆయన విజయాలకు పెట్టింది పేరు. రాజుగారి బ్యానర్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు.. విజయం అనేది ఇంటి ముందు నిల్చుంటుందనే నమ్మకం ఉంది. ఈ మధ్యే జానుతో వచ్చాడు ఈయన. ఈ నిర్మాత ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. దిల్ రాజు రెండో పెళ్లి వార్త ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఈయన రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రాజుగారి భార్య అనిత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కొన్నాళ్లు ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోయాడు. తన వెంకటేశ్వర బ్యానర్ సినిమాల్లో తన సినిమాలకు భార్య పేరునే ముందుగా వేస్తుంటాడు దిల్ రాజు. ఈ దంపతులకు ఒకే కూతురు కాగా ఆమెకు పెళ్లి అయిపోయింది. భార్య చనిపోయిన తర్వాత రాజు ఒంటరి అయిపోయాడు. దాంతో ఈయనకు తోడు కావాలని.. దాంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు కూడా సలహాలు ఇవ్వడంతో రాజు కూడా ఆ వైపుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే దీనిపై ఎవరూ ముందుకొచ్చి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఖండించడం లేదంటే నిజమే అయ్యుంటుంది అంటున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈయన రెండో పెళ్లికి సంబంధించిన మరో కీలక అప్ డేట్ బయటికి వచ్చింది. రాజుగారి పెళ్లి తేదీ కూడా ఖరారైపోయింది. ఫిబ్రవరిలోనే ఈయన పెళ్లి జరగాల్సి ఉన్నా కూడా అనివార్య కారణాలతో కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే దిల్ రాజు పెళ్లిపై ఎక్కడా అఫీషియల్ సమాచారం మాత్రం ఇవ్వడం లేదు. అయితే ఈయన పెళ్లి చేసుకునేది ఒక టాప్ హీరోయిన్ ను అని వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో కూడా ఈమె పనిచేసిందని, దిల్ రాజు పెళ్లి ప్రపోజల్ తీసుకురాగానే ఆమె సంతోషంగా ఒప్పుందంట. ఇక ఆ హీరోయిన్ తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారని, వాళ్ళు ఈ మధ్యనే ఇండియా వచ్చి పెళ్లి సంబంధాన్ని ఒకే చేసుకుని వెళ్ళారంట. ఇక దిల్ రాజు చేసుకోబోయే ఈ హీరోయిన్, ఈయనకు చాలా రోజులుగా తెలుసు అని, ఇద్దరూ ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.

Image result for dil raju second marriage

మరోవైపు ఈ పెళ్లికి దిల్ రాజు కూతురు కూడా ఒప్పుకుందని.. ఆమె నిర్ణయం కోసమే ఇన్ని రోజులు దిల్ రాజు వేచి చూసాడని తెలుస్తుంది. తాత అయినా కూడా దిల్ రాజు మాత్రం అలా అయితే కనిపించడు. దాంతో ఈ వయసులో ఒంటరిగా మిగిలిపోకుండా పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటున్నారు కొందరు. పెళ్లి ఎప్పుడు జరిగినా కూడా షాద్నగర్లో ప్రకాశ్ రాజ్ గెస్ట్ హౌజ్లో జరగనుందని తెలుస్తుంది. ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉంటుందని, అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు దిల్ రాజు. సన్నిహితుల బలవంతంపైనే ఈ పెళ్లికి దిల్ రాజు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈయన మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా అలాంటి ప్రస్థావన మాత్రం తీసుకురాలేదు. ఏదేమైనా కూడా దిల్ రాజు పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Content above bottom navigation