బుల్లితెరపై దుమ్ములేపుతున్న వీళ్ళు నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా?

119

యాంకర్ అంటే అలా మెరిసి ఇలా మాయమయ్యే సెలబ్రెటీలంటారు. కాని వీళ్లు మాత్రం స్టార్ హీరోలు, హీరోయిన్ల రేంజ్ లో పాపులర్ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు టీవీ యాంకర్ అంటే ఇంటర్వూలు చేయటం, టీవీల్లో మెరవటం, సినిమా ఫంక్షన్స్ లో తళుక్కుమనటం వరకే ఉండేది కానీ ఇప్పుడు యాంకర్స్ స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ పెంచేసుకున్నారు. వాళ్ల ఇంటి మీద టాక్స్ రైడ్ జరిగేంత స్టేజ్ కి రేంజ్ కి ఎదిగిపోయారు. ఏ అవార్డ్ ఫంక్షన్ లో చూసినా, సుమ లేదంటే అనసూయ, కాదంటే ప్రదీప్ కుదరకపోతే శ్రీముఖి, రవి, రష్మి.. ఇలా ఎవరో ఒకరు మెరుస్తారు. అయితే వీళ్ళ ఒక్కొక్కరి సంపాదన ఏ రేంజ్ లో ఉందొ ఇప్పుడు చూద్దాం.

Image result for telugu anchors

యాంకర్స్ లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లేడీ సూపర్ స్టార్ సుమ గురించి. ఏ టీవీ ఛానల్ లో చూసినా, ఏ సినిమా సెలబ్రేషన్స్ లో చూసినా, అవార్డు ఫంక్షన్ ఇంకేదైనా అంతటా యాంకర్ సుమ తళుక్కులే, తెలుగు యాంకర్స్ లోనే మోస్ట్ బిజీయెస్ట్ హోస్ట్. హీరోలు, హీరోయిన్లకు ఉన్నంత పాపులారిటీ ఉంది సుమకు. స్టార్ మహిళతో పాటు భలే భలే ఛాన్స్ లే, క్యాష్ , కెవ్వు కేక, ఈ జంక‌షన్ లాంటి షోలతో తిరుగులేని యాంకర్ గా మారింది సుమ. ఈమె ఒక్కరోజు సాయంత్రం జరిగే సినిమా ఈవెంట్ కే 4 లక్షలు ప్లస్ జీఎస్టీ అంటూ ఓ ప్రచారం ఉంది. ఈమె సంపాదన నెలకు దాదాపుగా కోటి వరకు ఉంటుందంట. ఇక మరొక యాంకర్ అనసూయ. అనసూయ ఆడి కార్ మీద ఎన్నో జోకులున్నాయి, ఏడాదికి 3 కోట్ల టాక్స్ కడుతుందనే ప్రచారం ఉంది. రీసెంట్ గా జీఎస్టీ అధికారులు ట్యాక్స్ రైట్ చేశారన్న వార్త కూడా బయటకు వచ్చింది. అనసూయ కూడా సింగిల్ ఈవెంట్ కి నాలుగైదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే ప్రచారం ఉంది. అంతేకాదు రంగస్థలం లో రంగమ్మత్తగా కనిపించినప్పటి నుంచి ఇమేజ్ పెరగడంతో రెమ్యునరేషన్ ఇంకా పెంచేసిందట. సినిమాలకు అయితే భారీగానే డిమాండ్ చేస్తుందంట. ఈమె సంపాదన నెలకు కోటిన్నర వరకు ఉంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక బుల్లితెర మీద దుమ్ము లేపుతున్న మరొక యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఈయన కూడా యాంకర్ నుంచి స్టార్ రేంజ్ కి తను ఎదిగిపోయాడు. ఈవెంట్లు, ఢీ, కొంచెం టచ్ లో ఉంటే చెబుతా… ఒక్కో షోతో పబ్లిక్ లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏడాదికి 7 కోట్ల ట్యాక్స్ కడుతాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈయన కూడా ఒక్కో షోకు 4 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. ఈయన సంపాదన నెలకు కోటిన్నర వరకు ఉంది. ఇక మరొక యాంకర్ రష్మి. జబర్దస్త్ అనే షో తో హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న ఈమె మూవీస్ లలో కూడా నటించి తన స్థాయిని పెంచుకుంది. రేష్మి కూడా నెలకు దాదాపు 80 లక్షల వరకు సంపాదిస్తుంది. ఇక వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సింది శ్రీముఖి, రవి గురించి. వీళ్ళు కూడా బాగానే సంపాదిస్తున్నారు. బిగ్ బాస్ తర్వాత ఇమేజ్ పెంచుకున్న శ్రీముఖి ఒక్కొక్క షోకు 3 లక్షల వరకు తీసుకుంటుంది. ఈమె నెలకు దాదాపు 80 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. అలాగే రవి చాలా షో లలో యాంకరింగ్ చేస్తున్నారు. ఈయన కూడా ఒక్కొక్క షోకు 2 లక్షల వరకు తీసుకుంటున్నాడు. నెల సంపాదన వచ్చేసరికి కోటి రూపాయల వరకు ఉంది. ఇక కమిడియన్ గా, యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు సుదీర్. ఈయన ఒక్కొక్క షోకు 3 లక్షల వరకు తీసుకుంటున్నాడు. ఈయన నెల సంపాదన కోటికి పైగానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే యాంకర్ గా నిలదొక్కుకుంటున్న విష్ణు ప్రియా, వర్షిణి లాంటి యాంకర్స్ నెలకు 20 నుంచి 30 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇలా మన యాంకర్స్ హీరోయిన్స్ తగ్గ రేంజ్ లో బాగానే సంపాదిస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation