షాకింగ్ న్యూస్ : కరోనా సోకి హీరోయిన్ తండ్రి మృతి.. ఆందోళనలో సినీ ఇండస్ట్రీ

కోవిడ్ -19 కు నువ్వు నేను.. చిన్నోడు పెద్దోడు.. పేదోడు ధనికుడు అనే తేడా తెలియదు. అందరికీ సోకడమే.. సోకిన వాళ్లు సరైన వైద్యం తీసుకోకపోతే పైకి వెళ్లడమే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కొందరు సెలబ్రిటీలకు కూడా ఇది సోకింది. ముఖ్యంగా హాలీవుడ్‌ లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కోవిడ్ -19 బారిన పడ్డారు. తాజాగా ఓ హీరోయిన్ తండ్రి కూడా కోవిడ్ -19 బారినపడి మరణించాడనే వార్త సినీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

వేగంగా వ్యాప్తి.. జంకుతున్న ప్రజలు

చైనా దేశంలో పుట్టిన ఈ కోవిడ్ -19 చాలా వేగంగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటికే 175 దేశాలకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదు కావడంతో ప్రపంచ జనాభా అంతా జంకుతున్నారు. ఇక ఈ కోవిడ్ -19 మహమ్మారి పలువురు సెలబ్రిటీలకు కూడా సోకడం మరింత ఆందోళన చెందిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది కోవిడ్ -19 బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇక హాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కొందరు హీరోహీరోయిన్లు కూడా కరోనా బారిన పడటం ఆందోళన చెందిస్తుండగా.. ఇది చాలదన్నట్లు ఓ హీరోయిన్ తండ్రి ఇప్పుడు కోవిడ్ -19 సోకి మరణించారనే వార్త తెలిసి ఉలిక్కిపడింది సినీ లోకం. హాలీవుడ్‌ హీరోయిన్‌ సోఫియా మైల్స్‌ తండ్రి పీటర్‌ మైల్స్‌ కోవిడ్ -19 బారిన పడి ఆదివారం రోజు కన్నుమూశాడు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

కొన్ని రోజులుగా పార్కిన్‌ సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కోవిడ్ -19 కూడా సోకింది. దీంతో ఆయన కోలుకోలేకపోయాడు.. ఆసుపత్రిలో చేర్పించినా.. మెరుగైన చికిత్స అందించినా కూడా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. ఈ క్రమంలోనే మార్చ్ 22న ఆయన చనిపోయారు. తండ్రి మరణించిన విషయాన్ని సోఫియా ట్విటర్‌‌లో అభిమానులతో పంచుకుంది. RIP పీటర్‌ మైల్స్‌.. మా నాన్న కొన్ని గంటల కిందే చనిపోయారు.. కోవిడ్ -19 కారణంగానే ఆయన చనిపోయారంటూ పోస్ట్ చేసింది సోఫియా. ఇదిలా ఉంటే ఇండియాలో కూడా కోవిడ్ -19 విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో 27 కేసులు నమోదయ్యాయి.. దాంతో పాటు దేశవ్యాప్తంగా 230 మందికి పైగా కోవిడ్ -19 సోకింది. భారత్ లో కోవిడ్ -19ను నివారించడానికిప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. నిన్న జనతా కర్ఫ్యూ ను నిర్వహించింది. యావత్తు భారతావని ఒక్క తాటిపై వచ్చి జనతా కర్ఫ్యూను సక్సెస్ చేశారు. అలాగే మార్చి 31 వరకు భారత్ లో లాక్ డౌన్ ను ప్రకటించారు. దీనితో కోవిడ్ -19 ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది.

Content above bottom navigation