సినీ ఇండస్ట్రీలో విషాదం : కరోనా కారణంగా ప్రముఖ నటి కన్నుమూత

చైనా దేశంలో పుట్టిన కోవిడ్ -19 చాలా వేగంగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటికే 182 దేశాలకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదు కావడంతో ప్రపంచ జనాభా అంతా జంకుతున్నారు. కోవిడ్ -19 కు నువ్వు నేను.. చిన్నోడు పెద్దోడు.. పేదోడు ధనికుడు అనే తేడా తెలియదు. అందరికీ సోకడమే.. సోకిన వాళ్లు సరైన వైద్యం తీసుకోకపోతే పైకి వెళ్లడమే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కొందరు సెలబ్రిటీలకు కూడా ఇది సోకింది. ముఖ్యంగా హాలీవుడ్‌ లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కోవిడ్ -19 బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్‌ కు కోవిడ్ -19 వచ్చి మరణించింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

విషాదం.. కరోనాతో కన్నుమూసిన ప్రముఖ ...
సొగసులతో చిత్తు చేస్తున్నమీరా చోప్రా.

కోవిడ్ -19 కారణంగా హాలీవుడ్ నటి హిల్లరీ హీత్ (74) కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నటి హిల్లరీ హీత్ కుమారుడు అలెక్స్ విలియమ్స్ తన తల్లి మరణించిన విషయాన్ని వెల్లడించారు. తన ఫేస్‌ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ పెట్టి హిల్లరీ హీత్ మరణించినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కోవిడ్ -19 లక్షణాలతో చనిపోయింది కానీ కోవిడ్ -19 సోకి కాదని కుమారుడు అలెక్స్ విలియమ్స్ తెలిపినట్లు సమాచారం. ఇంగ్లండ్‌ లోని లివర్‌ పూల్‌ లో జన్మించిన హిల్లరీ హీత్.. నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. 1968 సంవత్సరం వచ్చిన ‘ విచ్‌ఫైండర్ జనరల్ ‘ సినిమాతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. నిర్మాతగా కూడా మారి పలు సినిమాలు రూపొందించింది. హిల్లరీ నిర్మించిన సినిమాల్లో ‘యాన్ ఓఫులీ బిగ్ అడ్వెంచర్’, ‘నీల్ బై మౌత్’ చిత్రాలు ముఖ్యమైనవి. హిల్లరీ హీత్ మరణం పట్ల హాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

అందమా అద్బుత రూపమా అన్నట్లు ఉన్న నిధి అగర్వాల్..

ఇక ఇప్ప‌టికే హాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ టామ్‌ హ్యాంక్స్‌, రీటా విల్సన్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలింది. అలాగే ఈ లిస్టులో ఇప్ప‌టికే ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు కూడా ఉన్నారు. కోవిడ్ -19తో బాధపడుతూ యూనివర్సల్‌ మ్యూజిక్‌ అధినేత, సీఈవో లుసియన్‌ గ్రినేజ్‌ ఆస్పత్రిలో చేరారు. ఇలా చాలామంది ప్రముఖులు కోవిడ్ -19 మూలాన హాస్పిటల్ బారిన పడుతున్నారు. మ‌రి ఈ వైర‌స్ ఎప్పుడు త‌గ్గు ముఖం ప‌డుతుందో ? ప్ర‌పంచం ఎప్పుడు శాంతిస్తుందో ? చూడాలి.

Content above bottom navigation