గుడ్ న్యూస్ తల్లి కాబోతున్న సమంత

240

సమంత, నాగ చైతన్య వివాహం జరిగి రెండేళ్లు దాటిపోయింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. సమంత అయితే వరుసపెట్టి సినిమాలు తీస్తుంది. అన్ని సూపర్ హాట్ సినిమాలే తీసింది. ఈ మధ్యనే భర్త అక్కినేని నాగచైతన్యతో కలిసి మజిలీ చేసి ఇద్దరి ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ వేసుకున్నారు. అయితే సినిమాల విషయం పక్కన పెడితే… అభిమానులు మాత్రం వీరి నుంచి గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సమంత అక్కినేని త్వరలో శుభవార్త వినిపించబోతున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇంతకీ విషయం ఏంటంటే.. నెల రోజుల క్రితం సమంత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా నటించనున్నారు. ఇంతవరకు తాను ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ వినలేదని అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నానని సమంత అన్నారు. అయితే ఇప్పుడు సమంత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆమె తల్లి కాబోతుండడమే అని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనిపై సమంత ఏమంటారో వేచి చూడాలి. గతంలో కూడా గర్భం దాల్చారంటూ వచ్చిన వార్తలపై సమంత గట్టిగానే స్పందించారు. ఫ్యాన్స్ పోరు పడలేక 2021లో ఆగస్ట్‌లో బిడ్డను కనబోతున్నానని అన్నారు. అయితే నిజంగా అన్నారా జోక్‌గా అన్నారా అన్నది ఆమెకే తెలియాలి. మరి ఇప్పుడు వస్తున్న వార్తలపై ఆమె ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Image result for samantha akkineni

అయితే తనకు పుట్టబోయే బిడ్డ గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘నేను ఎప్పుడైతే తల్లిని అవుతానో అప్పుడు ఆ బిడ్డే నాకు ప్రపంచం అవుతుంది. నా బిడ్డ కోసం నేను కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటాను. నేను చిన్నప్పుడు కోల్పోయినవన్నీ నా బిడ్డకు ఇస్తాను. ఎందుకంటే నా బాల్యం అంత సజావుగా సాగిపోలేదు. కానీ నా బిడ్డ ఆ కష్టాలు పడకూడదు. నేను, చై ఓ డేట్ అనుకుంటున్నాం. అయితే ఆ డేట్ ఎప్పుడన్నది నేను మీకు చెప్పను. ఎందుకంటే చెప్పిన సమయానికి నేను గర్భం దాల్చకపోతే అందరూ చైలో ఏదో లోపం ఉందని అనుకుంటారు’ అని సమంత చెప్పింది. ఇకపోతే సమంత నటించాల్సిన సినిమాలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారు. ఏప్రిల్‌ నుంచి షూటింగ్ మొదలుకావాల్సి ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation