ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?

202

హీరోయిన్లు చాలా మంది దీపం ఉండగానే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవాలి అనే కాన్సెప్టునే ఫాలో అవుతారు.. ఒక‌సారి ఫేమ్ పోతే మ‌ళ్లీ సినిమాల్లో అవ‌కాశాలు రావు అనేది తెలిసిందే, నాలుగు ఐదు వ‌రుస‌గా హిట్లు వ‌స్తేనే వారు ఓ నాలుగైదు సంవ‌త్స‌రాలు సినిమా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుంటారు.సినీ ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా హీరోహీరోయిన్స్ విషయంలో అనుకోని మలుపులు తిరుగుతుంటాయి. స్టార్ స్టేటస్ ఖాయం అనుకున్న వాళ్ళు కనుమరుగై పోవడం, ఏదో ఫర్వాలేదులే అనుకున్న వాళ్ళు స్టార్ స్టేటస్ పట్టేయడం ఎన్నో సందర్భాల్లో చూసాం. ఒకప్పుడు యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్న హీరోయిన్ రేఖ.. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర సంగతులు చెప్పింది.

Image result for Rekha Vedavyas

ఆమె పేరు చెబితే వెంట‌నే వినిపించి మ‌న‌ల్ని ప‌ల‌క‌రించే సాంగ్ , క‌నులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా.. నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా అంటూ టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త లోకాన్ని పరిచయం చేసింది రేఖ.ఆనందం’ సినిమాలో నటించి, ఈ పాటకు గాను ఆమె చూపిన అభినయం.. హావభావాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే ముద్రించుకొని ఉన్నాయి.15 ఏళ్ల క్రితం అలా ‘ఆనందం’గా అలరించిన రేఖ వెండితెరకు దూరమైపోయింది. తెలుగు సినీ పరిశ్రమలోకి కొత్త హీరోయిన్ల రాక ఎక్కువ కావడంతో క్రమంగా ఈమె పేరును మరచిపోయారు ఆడియన్స్. అంతేకాదు ఒకానొక సమయంలో రేఖ మరణించిందనే వార్తలు కూడా షికారు చేశాయి. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సర్‌ప్రైజ్ చేసిన రేఖ.. తనకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పింది.

ఈ క్రింది వీడియోని చూడండి

కొన్నేళ్ల క్రితం తాను చనిపోయినట్లు వార్తలు వచ్చాయని రేఖ చెప్పింది…. బతికుండగానే శ్రద్ధాంజలి ఫొటో చూసుకునే ఛాన్స్ ఎవరికి వస్తుంది చెప్పండి అంటూ సరదాగా స్పందించింది. అంతేకాదు అప్పటినుంచి తాను ఎవరింటికన్నా పోతే.. తిరిగి వెళ్లిపోయేటప్పుడు న్యూస్ పేపర్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతానని చెప్పింది. ఆ పేపర్‌లో తన మరణ వార్త గురించి చూసి అంతా షాక్ అయ్యేలా చేస్తానని తెలిపింది.ఇక తాను నాగార్జున హీరోగా రూపొందిన మన్మథుడులో గెస్ట్ రోల్ చేసానని, అది కేవలం నాగార్జున గారి కోసమే చేసానని చెప్పింది రేఖ. అయితే ఆ తర్వాత ఆయన తనతో కలిసి మరో సినిమా చేద్దామన్నారు కానీ.. ఇప్పటివరకు ఫోన్ చేయలేదని చెప్పింది. నాగార్జున గారూ మీ ఫోన్ కోసం వెయిటింగ్ ఇక్కడ. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. మంచి అబ్బాయి కోసం వెయిటింగ్అ ని చెప్పింది రేఖ.సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో.. నువ్వు సీఎం అయితే ఏం చేస్తావ్’ అని రేఖను ప్రశ్నించాడు ఆలీ. దీనిపై స్పందించిన ఈ హీరోయిన్.. నేను సీఎం అయితే పార్కుల్లో అందరూ విచ్చలవిడిగా తిరిగేలా చేస్తాను అని చెప్పి షాకివ్వడం విశేషం. ఆమె సమాధానం విని ఆలీతో సహా అంత ఆశ్చర్యపోయారు. పోలే వ‌చ్చే రోజుల్లో రేఖ మంచి సినిమాలు చేసి ఓ ఇంటికి కోడ‌ల‌వ్వాలి అని, మంచి భ‌ర్త‌ని పొందాల‌ని మ‌నం కూడా కోరుకుందాం..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation