బాలకృష్ణ భారీ విరాళం.. ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే 184 దేశాల్లో ఈ వైరస్ విస్తరించింది. ఈ వైరస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించేసింది. ఇండియాలో ఇప్పటికే 79 మంది మరణించగా, 2400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 161 కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనాని అరికట్టేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే క‌రోనా నివార‌ణ‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్యల‌కు త‌మ వంతుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్ లాంటి వారంతా భారీ విరాళాలు ప్రకటించారు. కాగా.. ఇప్పుడు వీరి జాబితాలో నందమూరి బాలకృష్ణ కూడా జాయిన్ అయ్యాడు.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

Balakrishna EX PA Sekhar Naidu sentenced 3 years jail - tollywood

కరోనా క్రైసిస్‌ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు హిందుపురం ఎమ్మెల్యే, నటసింహం బాలకృష్ణ. కరోనాపై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్‌ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి. కళ్యాణ్‌ కు అందించారు. ఈ సందర్భంగా స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనాని అరికట్టడంలో అందరం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు బాలయ్య.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఇక తన సొంత నియోజక వర్గం హిందూపురంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తగు చర్యలు చేపట్టారు బాలయ్య. ఇటీవల హిందూపురం కూరగాయల మార్కెట్ దగ్గర ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు దాదాపు 3000 మందికి ఉచితంగా మాస్కుల పంపిణీ చేశారు. పేదలకు ప్రభుత్వం రేషన్ ఇస్తున్నందున.. ప్రజలకు కూరగాయాలు ఇవ్వాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. హిందూపురంలో తన అనుచరుడు అంబికా లక్ష్మినారాయణకు కూరగాయల పంపిణీ బాధ్యతలు అప్పగించి.. నిత్యవసరస వస్తువైన కూరగాయల్ని అందిరికీ అందుబాటులో ఉంచుతున్నారు బాలయ్య. ఇక బాలయ్య పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Content above bottom navigation