రేపు రాత్రి 9 గంటలకి దీపాలు ఎందుకు వెలిగించాలో చెప్పిన చరణ్

కరోనా వైరస్ ఇండియాను కమ్మేస్తుంటే.. మౌనంగా చూస్తుండటం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు పాపం జనం. వైద్యులు, పోలీసులు అయితే పగలనక రేయనక తమ డ్యూటీలు చేస్తున్నారు. ఇక సినిమా వాళ్లు కూడా ఎప్పటికప్పుడు తమ బాద్యతను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇదే చేస్తున్నాడు. మొదట్నుంచి కూడా మెగా ఫ్యామిలీ ఎంతగానో ముందు నడుస్తున్నారు. సెలబ్రిటీలు ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని అందరికీ పిలుపునిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇదే చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రజలకు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును వినిపించారు తండ్రి కొడుకులు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఆయనకు మద్దతుగా నిలవాలని.. మోదీ చెప్పినట్లు చేద్దామని చెబుతున్నారు వాళ్లు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మన ఇళ్లలోని లైట్స్ ఆపేసి దీపాలు వెలిగిద్దాం.. ప్రధాని మోదీగారి మాటను పాటిద్దాం. ఎవ్వరూ మరిచిపోవద్దు.. కరోనా లేని ఇండియాను సాదిద్ధాం అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.ఇక చిరంజీవి కూడా కరోనాను ఎదుర్కొనే విషయంలో భారతీయులంతా ఒక్కటే అని నిరూపిద్దాం.. ప్రధాని మోదీ చెప్పినట్లు ఆదివారం 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆర్పేసి.. ఇంటి బయటికి వచ్చి సెల్ ఫోన్ ఫ్లాష్ కానీ కొవ్వొత్తులు కానీ వెలిగిద్దామని చెప్పాడు చిరంజీవి. వాళ్లతో పాటు మిగిలిన సెలబ్రిటీస్ కూడా మోదీ చెప్పినట్లు చేద్దామంటున్నారు.

Content above bottom navigation