హీరో శ్రీకాంత్ ఊహల లవ్ స్టోరీ..

హీరో శ్రీకాంత్ తన సహచర నటి అయిన ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్లకు ముగ్గురు పిల్లలు కూడా. పెద్ద కొడుకు రోషన్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఒక మూవీలో కూడా నటించాడు. చిన్న కొడుకును కూడా సినిమాలలోకి తీసుకొస్తున్నారు. ప్రభుదేవాతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కూతురు మేధా రుద్రమదేవి సినిమాలో నటించింది. ఇలా పిల్లలను కూడా మెల్లిమెల్లిగా సినిమాలలోకి తీసుకొస్తున్నాడు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలైంది. ముందు ఎవరు ఎవరికీ ప్రపోజ్ చేశారు. వీరి పెళ్లి ఎలా జరిగింది. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీకాంత్, ఊహ కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. ఆమె, ఆయనగారు, కూతురు సినిమాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ‘ఆమె’. ఈ చిత్రంతోనే ఊహ తెలుగు చిత్రపరిశ్రమకి హీరోయిన్‌గా పరిచయమైంది. అలాగే ఆమె శ్రీకాంత్ జీవితంలోకి ప్రవేశించడానికి కారణం కూడా ఈ చిత్రమే. ఆమె చిత్రం ముహూర్తపు షాట్‌ లోనే తొలిసారిగా వీరు ఒకరినొకరు చూసుకున్నారట. అలా ఏర్పడిన వారి పరిచయం.. ఆ తర్వాత స్నేహంగా మారింది. అదే స్నేహం ఇద్దరి మధ్య ఇష్టాన్ని పెంచింది. కానీ ఎంత స్నేహితులైనా ఈ ఇద్దరు కూడా తమ ప్రేమని ఒకరితో మరొకరు పంచుకోలేదు. కానీ ఓ సందర్భంలో శ్రీకాంత్ తన రియల్ లైఫ్‌లో కూడా హీరోలాగే డేరింగ్, డ్యాషింగ్‌‌ గా ఊహ ఇంటికి నేరుగా వెళ్లి ప్రపోజ్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారట. వారి ప్రేమకథకే ఇది ఓ హైలైట్ సంఘటన అని చెప్పొచ్చు.

ఎందుకంటే వీరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికి, అది వారే అప్పటికి ఇంకా పంచుకోలేదు. అటువంటిది శ్రీకాంత్ నేరుగా ఊహ ఇంటికి వెళ్ళడం మాత్రమే కాదు. వాళ్ళ తల్లిదండ్రులని, ఊహని దేవుడు గదిలోకి పిలిచి ‘నేను తనని ప్రేమిస్తున్నాను.. అలాగే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను’ అని చెప్పి తన మెడలోని బంగారు గొలుసు తీసి ఆమె మెడలో వేసాడట. ఈ ఊహించని పరిణామానికి అందరూ షాక్ అయినప్పటికి, అందులో నుండి బయటకి వచ్చి అందరూ వీరి ప్రేమని అంగీకరించారు.

Image result for srikanth ooha combination movies

అయితే శ్రీకాంత్ ఈ షాక్ ఇవ్వకముందే ఊహ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూశారట. ఈ ప్రపోజల్ తెలిసాక ఆ సంబంధాలు అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. శ్రీకాంత్ కూడా ఆ తర్వాత తన ఇంటిసభ్యులకు ఇదే స్టైల్‌‌లో సూటిగా తాను ఊహని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. తొలుత ఇది సాధ్యపడుతుందా లేదా..? అని ఆలోచించినప్పటికి వారు కూడా ఈ ఇద్దరి ప్రేమని అంగీకరించి పెళ్ళికి పచ్చ జెండా ఊపారు. అయితే ఈ ఇద్దరు ప్రేమించుకున్నట్టు అప్పట్లో ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదంట. చాలా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ కు మాత్రమే తెలుసంట. అయితే అలా కొన్ని రోజులు ప్రేమించుకున్నాకా, ఎంగేజ్ మెంట్ పెట్టుకుంటే అప్పుడు ఇండస్ట్రీలో మిగతా వారికీ తెలిసి షాకయ్యారంట. ఆ తర్వాత జనవరి 20, 1997 న ఈ ప్రేమికులు భార్యాభర్తలుగా మారారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఊహ సినిమాలు మానేసి ఇంటి బాధ్యతలను చూసుకుంది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation