హీరోయిన్ దీక్షా సేథ్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు

1488

మన టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు అందంగా ఉన్న కూడా కొన్ని సినిమాల చేసి కెరీర్ లో సరైన సక్సెస్ లేక పెళ్లిళ్లు చేసుకొని సినిమా కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పినోళ్లు చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది హీరోయిన్లు అయితే నాలుగైదు సినిమాలు చేసి వాళ్ళ ఆచూకీ కూడా తెలియకుండా పోయింది. అలాంటి హీరోయిన్స్ లో ఒక్కరు దీక్షసేత్. అయితే ఈ అమ్మడు ఈ మధ్య ఏ సినిమాలలో గానీ, ఏ ఫంక్షన్ లో గానీ, ఏ సోషల్ మీడియా లలో గానీ కనిపించడం లేదు. అసలు దీక్షాసేత్ ఏమైంది, ఎక్కడికి పోయింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన “వేదం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమయ్యింది హీరోయిన్ దీక్షా సేథ్. వచ్చీరావడంతోనే మంచి ఫేమస్ డైరెక్టర్ మరియు స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో నటించింది. తొలి సినిమా వేదం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా విమర్శల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు దీక్ష సేత్ మోడలింగ్ రంగంలో ఒక్క రేంజ్ లో రాణించింది.

Heroin Deeksha Seth Current Situation

2009 వ సంవత్సరం లో ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో ఫైనలిస్ట్ గా వచ్చిన దీక్ష సేత్, ఆ తర్వాత మోడలింగ్ కాంటెస్ట్ లో పాల్గొనడానికి హైదరాబాద్ కి వచ్చిన సమయంలో డైరెక్టర్ క్రిష్ దృష్టిన పడింది. అప్పటికే ఆయన వేదం సినిమాలో అల్లు అర్జున్ కి హీరోయిన్ గా నటించే అమ్మాయి కోసం దాదాపు 80 మందిని ఆడిషన్ చేసి రిజెక్ట్ చేసాడు.

ఆ 80 మందిలో అందంలో కానీ అభినయంలో కానీ దీక్ష సేత్ డైరెక్టర్ క్రిష్ దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఆమెని అన్ని కోణాల్లో ఆడిషన్స్ చేసి, బాగా నచ్చడంతో వెంటనే వేదం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు డైరెక్టర్ క్రిష్. తొలి సినిమాలో ఈమెని చూసిన చాలా మంది ప్రేక్షకులు భవిష్యత్తులో ఈమె టాప్ హీరోయిన్ అవుతుంది అనే అనుకున్నారు.

ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. గోపి చంద్ తో వాంటెడ్, ప్రభాస్ తో రెబెల్, రవితేజతో నిప్పు,మిరపకాయ్ వంటి సినిమాలు చేసింది. వీటిల్లో రవితేజతో చేసిన మిరపకాయ్ సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో దీక్ష సేత్ కి అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో సాత్ కాడం అనే సినిమా చేసింది.

ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి దూరంగా వెళ్ళిపోయింది. సినిమాలకు దూరం అయిన ఈమె, 2016 తర్వాత కనీసం మీడియాకి కూడా దొరకలేదు. సోషల్ మీడియాలో కానీ ,యూట్యూబ్ లో కానీ ఈమె ఆచూకీ ఎవ్వరికి తెలియకుండా పోయింది. అయితే ఇటీవల ఈమె గురించి బయటపడ్డ ఒక్క సంచలన విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

2016 వ సంవత్సరం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం ఆయన దీక్ష సేత్ నటిగా దాదాపు రిటైర్మెంట్ ప్రకటించేసి, నిర్మాతగా మాత్రం ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసింది. ఈ విషయం చాలా మందికి తెలియనిది. ఈమె నిర్మాతగా వ్యవహరించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయంసాధించాయి. అలా నటిగా ఆశించిన స్థాయి గుర్తింపు సాధించలేకపోయిన, నిర్మాతగా మాత్రం సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.

Content above bottom navigation