హైదరాబాద్‌లో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు.. గదిలో నగ్నంగా జంట.. జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్

36

హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరాయి.సీక్రెట్ గా వ్య‌భిచార దందా సాగిస్తూ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్నారు.న‌గ‌రంలో చాప‌కీంద నీరులా ఈ సంస్కృతి పాకుతోంది.నిత్యం ల‌క్ష‌లాది మంది వచ్చే న‌గ‌రంలో అసాంఘిక శ‌క్తులు చీక‌టి దందాలు చేస్తున్నారు.బ్యూటీపార్లర్లు, మసాజ్ సెంటర్ల పేరుతో పలువురు వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ అమాయక మహిళల శరీరాలతో వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవల హైటెక్‌సిటీ, కేపీహెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో పోలీసులు అనేక వ్య‌భిచార రాకెట్లను చేధించి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తాజాగా మ‌రో ముఠా పోలీసుల‌కి చిక్కింది.సినిమా, టీవీ కార్యక్రమాల్లో ఛాన్సుల కోసం నగరానికి వచ్చే యువతులను మభ్యపెట్టి వ్యభిచారిణులుగా మార్చేస్తున్నారు. అవకాశాల కోసం ఇలా చేస్తే ఏం కాదని వారిని మాయమాటలతో నమ్మిస్తున్నారు. తీరా వారికి ఎలాంటి అవకాశాలు కల్పించకుండా పూర్తిస్థాయిలో బ్రోత‌ల్ వ‌ర్క‌ర్లుగా మార్చేస్తున్నారు… దీంతో అటు తిరిగి ఇంటికి వెళ్లలేక.. వేరే పని చేయలేక చాలామంది అమ్మాయిలు ఇష్టం లేకపోయిన వ్యభిచార కూపంలోనే మగ్గిపోతున్నారు. హైదరాబాద్‌లో గుట్టుగా కొనసాగుతున్న ఈ దందాలపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. దీంతో తరుచూ ఏదొక చోట వ్యభిచార కేంద్రాలు బయటపడుతూనే ఉన్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

తాజాగా హైదరాబాద్‌లోని బాలానగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి పాపయ్య యాదవ్‌ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై బాలానగర్‌ పోలీసులు దాడి చేశారు. ఆ ఇంట్లో కొన్నాళ్లుగా వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు అకస్మాతుగా రైడ్ చేశారు. ఆ సమయంలో గదిలో యువతితో ఉన్న కె.శ్రీనివాస్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. యువతికి విముక్తి కల్పించి పునరావాస కేంద్రానికి తరలించారు. తనకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని ఆశ చూపించి ఇక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు యువతి పోలీసులకు చెప్పింది.

Image result for prostitute

ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని బాలానగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడని పోలీసులు తెలిపారు. అయాయక యువతులకు ఛాన్సులిప్పిస్తానని నమ్మించి వ్యభిచార కూపంలోకి నెట్టుతున్నాడని, అతడి వలలో పడి అనేక మంది జీవితాలను నాశనం చేసుకున్నాడని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆ ఇంటికి అపరిచిత వ్యక్తుల తాకిడి పెరగడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. తమకు పట్టుబడిన విటుడు శ్రీనివాస్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Image result for prostitute

ఇక కూకట్‌పల్లికి చెందిన ఆరిపాక కృష్ణ అనే యువకుడు కేపీహెచ్‌బీ ఒకటో నంబర్ రోడ్డులో స్పా కేంద్రంలో వ్యభిచార నిర్వహిస్తూ కొద్దిరోజుల క్రితం పట్టుబడ్డాడు. గుంటూరుకు చెందిన ఓ యువతి అక్కడ పనిచేస్తోంది. అయితే స్పా కేంద్రంతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కృష్ణ అడ్డదారులు తొక్కాడు. తన ద‌గ్గ‌ర పనిచేసే యువతికి పెద్దమొత్తంలో డబ్బు ఆశ చూపించి ఆమెతో వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. ఆమె సాయంతో ఇతర ప్రాంతాల నుంచి మరికొంతమంది యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నాడు. సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్‌నే వ్యభిచార కేంద్రంగా మార్చేశాడు. స్పా సెంటర్‌కు వచ్చే కస్టమర్లపై అనుమానం వచ్చిన కొందరు ఈ విషయాన్ని కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాదాపూర్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు, కేపీహెచ్‌బీ పోలీసులు సంయుక్తంగా స్పా సెంటర్‌పై దాడిచేసి కృష్ణతో పాటు యువతి, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. ఆరుగురు యువతులకు విముక్తి కల్పించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఇలాంటి కార్య‌క‌లాపాలు ఎక్క‌డ జ‌రుగుతున్నా క‌చ్చితంగా త‌మ‌కు స‌మాచారం ఇవ్వాలి అని పోలీసులు తెలియ‌చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation