ఇంద్రభవనం లాంటి ఇంటిని కొన్న హైపర్ ఆది… చూస్తే ఖచ్చితంగా నోరెళ్లబెడతారు…

156

వారానికి ఒకసారి వచ్చి మళ్ళి వచ్చేవారం ఎప్పుడొస్తుందా నాయి ప్రేక్షకుడు ఎదురుచూసేలా చేసే పోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్దస్త్ అనే చెప్పుకోవాలి. జబర్దస్త్ లో వచ్చే కామెడీ కోసం ప్రేక్షకుల ఎంతలా వెయిట్ చేస్తారో మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక్కొక్కరి స్కిట్ ఒక్కొక అద్భుతంగా ఉంటుంది. అయితే ఉన్న వారిలో అందరి కన్నా జనాలను ఎక్కువగా ఆకట్టుకునేది హైపర్ ఆది స్కిట్ అనే చెప్పుకోవాలి. ఆది స్కిట్ మొదలైందంటే పొట్ట చెక్కలు అయిపోతున్నా, వరస పంచ్‌ లు పేలుతూనే ఉంటాయి. ఇక ఆది ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడంట. దానికి కారణం ఆది కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for hyper aadi

ప్రస్తుతం చిత్రసీమలో చాలామంది నటీనటులు తమ తమ సొంతిల్లు కొనుక్కునేందుకు, దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇల్లు కొనేయగా, అల్లు అర్జున్ కొత్త ఇల్లు నిర్మాణ పనుల్లో ఉన్నారు. అలాగే యాంకర్ సుమ దంపతులు కూడా ఓ ఖరీదైన ఇల్లు కొన్నారు. ఇప్పుడు ఇదే బాటలో కమిడియన్ హైపర్ ఆది కొత్త ఇల్లు కొన్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారింది. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఇంటి కోసం దాదాపు 3 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

మంచి ఇంటీరియర్ డిజైన్ కూడా చేయించుకున్నాడంట. త్రిబుల్ బెడ్ రూమ్ లతో పాటు మంచి హాల్, స్విమ్మింగ్ ఫుల్ తో తనకు నచ్చినట్టు కట్టించుకున్నాడంట. వాస్తు ప్రకారం అన్నీ చూసుకుని భారీగా ఈ ఇంటిని తీసుకున్నారని, త్వరలోనే గృహప్రవేశం కూడా చేయనున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ ఇంటి ఓపెనింగ్ గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఏదేమైనా కూడా చాలా ఏళ్లుగా కష్టపడుతున్న దానికి ఇప్పుడు ఇలా ప్రతిఫలం దక్కిందన్నమాట. హైపర్ ఆది త్వరలోనే విలాసవంతమైన భవనంలోకి గృహ ప్రవేశం చేయనున్నారని సమాచారం.

Image result for హైపర్ ఆది

ఇక ఆది షోల విషయానికి వస్తే.. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు, ఢీ షో చేస్తున్నాడు. జబర్దస్త్ లో అనసూయతో ప్రేమ కహాని నడుపుతూ కామెడీ చేసే ఆది, ఢీ లో వర్షిణికి జోడిగా చేస్తూ, అక్కడ లవ్ ట్రాక్ నడిపిస్తూ కామెడీ పండిస్తున్నాడు. అలాగే సినిమాలలో కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. కమిడియన్ గానే కాకుండా రైటర్ గా కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. అలాగే స్పెషల్ షోలు, ఈవెంట్స్ తో బిజీబిజీగా ఉంటున్నాడు. రోజు వర్క్ తో నాలుగు రాళ్ళూ సంపాదించుకుంటున్న ఆది, ఇప్పుడు హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కోవడం ఆయన అభిమానుల్లో సంబరాలు నింపుతోంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation