రొమాన్స్ తో రెచ్చిపోయిన ఆది, వర్షిణి

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న సెలెబ్రిటీల్లోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లలో హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ రైటర్ కమ్ ఆర్టిస్టు తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని ఆది, ఒకపక్క టీవీ షోలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. దీంతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు కామెడీ స్కిట్లు మాత్రమే చేసిన ఆది.. తాజాగా ఓ యాంకర్‌తో రొమాన్స్ చేశాడు. అది కూడా అందరూ నోరెళ్లబెట్టి చూసేలా ఆమెను నలిపేశాడు. ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం..

అక్కడ కూడా అడుగు పెట్టేశాడు.. సత్తా చాటాడు

జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయిందో, అందులోని టీమ్ లీడర్ అయిన ఆదికి కూడా అంతకంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది. పది నిమిషాల పాటు వచ్చే అతడి స్కిట్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదరు చూస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అంతలా తన కామెడీ టైమింగ్‌ తో ప్రభావం చూపిస్తున్నాడు హైపర్ ఆది. అందుకే ఆది స్కిట్లకు వ్యూస్ కూడా ఎక్కువే. బుల్లితెరపై వచ్చే షోలలోనే కాదు.. సినిమాల్లోనూ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే అతడు ఎన్నో చిత్రాల్లో నటించాడు. మరికొన్నింటికి సంతకాలు కూడా చేసేశాడు. కేవలం నటుడిగానే కాదు.. డైలాగ్ రైటర్ గానూ ఆది తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అల్లరి నరేష్ నటించిన ‘మేడ మీద అబ్బాయి’ అనే సినిమాకే హైపర్ టాలెంటెడ్ కమెడియన్ సంభాషణలు అందించాడు. హైపర్ ఆది.. జబర్ధస్త్ షోలో టీమ్ లీడర్‌గా చేయడంతో పాటు కొన్ని స్పెషల్ ఈవెంట్లకు స్క్రిప్టు రాస్తాడన్న విషయం చాలా మందికి తెలియదు. అలాగే, ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’కి కూడా స్క్రిప్ట్ రాస్తాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం సుడిగాలి సుధీర్ రివీల్ చేశాడు. ఇప్పుడా షోలో ఆది టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

జబర్ధస్త్ షోలో అనసూయ వెంట పడుతూ ఉంటాడు హైపర్ ఆది. ఆయన అలా చేసేది స్కిట్‌లో భాగమే అని అందరికీ తెలుసు. ఇక, ‘ఢీ’లో మాత్రం తన కో యాంకర్ వర్షిణితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్‌లో ఆమెతో కలిసి ‘సామజవరగమన’ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. ఆ సమయంలో తామిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని చెప్పాడు. ఇక ఇదే షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఇందులో హైపర్ ఆది.. వర్షిణితో అదిరిపోయే రొమాన్స్ చేశాడు. ఓ రొమాంటిక్ సాంగ్‌కు ఈ జంట లీనమైపోయి మరీ నటించింది. దీంతో ఆదిలోని ఈ యాంగిల్ చూడని సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌తో పాటు జడ్జ్‌లు శేఖర్, ప్రియమణి, పూర్ణ నోరెళ్లబెట్టేశారు. దీంతో ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. హైపర్ ఆది అంటే పంచులు, ప్రాసలు మాత్రమే చాలా మందికి గుర్తు వస్తాయి. వీటి వల్లే అతడు బాగా పాపులర్ కూడా అయ్యాడు. కానీ, ఎప్పుడైతే ‘ఢీ’ షోలోకి ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటి నుంచి అతడి పద్దతి పూర్తిగా మారిపోయింది. వర్షిణితో కలిసి డ్యాన్స్‌లు చేయడం.. ఇలా రొమాన్స్ పండించడం వంటి వాటితో హైపర్ ఆది హాట్ టాపిక్ అవుతున్నాడు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation