అనసూయ టాప్ సీక్రెట్ ను బయటపెట్టిన హైపర్ ఆది..

90

జబర్దస్త్ ఎంతో మంది కమిడియన్స్ కు లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో చేసిన వాళ్ళు ఎన్నో సినిమాలలో నటిస్తూ నాలుగురాళ్లు వెనుక వేసుకుంటున్నారు. అలాంటివారిలో హైపర్ ఆది ఒకరు. ఆయన వేసే కామెడి పంచులు, డైలాగులు బ్రహ్మండంగా పేలుతాయి. అందుకే బుల్లితెర ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ఆదికి ఉంది. ప్రస్తుతం నాలుగైదు టీవీ షోలలో పాల్లొంటూ ఆయన యమ బిజీగా మారిపోయారు. అయితే ఆది ఈ మధ్య అనసూయ వెంట పడటం, ఆమెతో రొమాన్స్ చెయ్యడం, ఆమె మీద పంచులు వెయ్యడం ..జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో అనసూయకు సంబంధించి ఒక టాప్ సీక్రెట్ ను బయటపెట్టాడు హైపర్ ఆది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

తన హోయలతో షేక్ చేస్తున్న హెబ్బా పటేల్

Image result for hyper aadi and anasuya

జబర్దస్త్ షో అంటేనే సూపర్ కిక్. కమెడియన్ల పంచ్ డైలాగ్స్, రోజా నవ్వులు, అనసూయ స్పెషల్ అప్పియరెన్స్ అన్నీ దేనికవే ప్రత్యేకం. ఇక ఈ షోలో హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం మరింత స్పెషల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయను చూడగానే హైపర్ ఆది అలా అలా రెచ్చిపోవడం చాలా ఎపిసోడ్స్‌లో చూశాం. తన ప్రతీ స్కిట్ లోనూ అనసూయను ఇన్వాల్వ్ చేస్తూ ఆమెపై జబర్దస్త్ పంచులేస్తుంటాడు హైపర్ ఆది. లేదంటే అనసూయ కూడా అసూయ పడేలా మరో అమ్మాయిని వెంట తీసుకొచ్చి హల్చల్ చేస్తుంటాడు. గత కొంతకాలంగా ఇదే ఫార్ములా ఫాలో అవుతూ వస్తున్న హైపర్ ఆది.. ఈ సారి మాత్రం అనసూయ కోపానికి గురయ్యాడు. దీంతో ఈ ఎపిసోడ్ వీడియో నెట్టింట వైరల్ అయింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇన్నాళ్లు అనసూయ అందం, ఆమె బ్యూటీనెస్ పైనే పంచులేసిన మనోడు.. ఈ సారి ఆమె రెమ్యునరేషన్ గురించి కామెంట్స్ చేసి రచ్చ చేశాడు. సాధారణంగా జబర్దస్త్ లో చేసే యాంకర్స్, కమెడియన్స్ రెమ్యునరేషన్ వివరాలు బయట జనాలను అంతలా తెలీదు. కానీ ఈ మధ్య వచ్చిన ఎపిసోడ్ లో హైపర్ ఆది అనసూయ రెమ్యునరేషన్ వివరాలు చెప్పేశాడు. లాస్ట్ వీక్ ప్రసారం అయిన స్కిట్ అంతా అనసూయపైనే చేసిన ఆది.. అనసూయ గారూ మీరు భలే మేనేజ్ చేస్తారండీ అంటూ ఆమెపై వరుసగా పంచులు విసిరాడు హైపర్ ఆది.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ నమిత

Image result for anasuya aadhi

అంతేకాదు అనసూయకు ఈవెంట్‌కు 3 లక్షలు ఇస్తారు.. మాకు మాత్రం లక్ష ఇస్తారంటూ రెమ్యునరేషన్‌పై సెటైర్ వేసాడు హైపర్ ఆది. అలా ఆమెపై పంచులయితే బాగానే పేలాయి.. కానీ ఈ స్కిట్‌లో ఆది రాసిన డైలాగులు కామెడీ కోసమే అయినా అనసూయ రెమ్యునరేషన్ మాత్రం ఇలా బయటపడిందని చెప్పుకుంటున్నారు ఆడియన్స్. జబర్దస్త్ షో పరంగా కొన్ని జోడీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో ఒక జోడీ రష్మీ గౌతమ్- సుధీర్ కాగా మరో జోడీ అనసూయ- హైపర్ ఆది. జబర్దస్త్ వేదికపై ఈ జంటల హంగామా మామూలుగా ఉండదనే విషయం అందరికీ తెలుసు. ఒకరిపై ఒకరు పంచుకోలేసుకుంటూ ప్రేక్షకులకు పొట్టచెక్కలయ్యే వినోదం పంచే వీళ్ళు ఇప్పుడు మాత్రం ఇలా రెమ్యునరేషన్ సీక్రెట్స్ చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation