Breaking News:డైరెక్టర్ శంకర్ పరిస్థితి విషమం ఆందోళనలో చిత్ర పరిశ్రమ

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో ఆమె నటిస్తుండటం విశేషం. తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో ఇప్పుడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులో వెక్కట్ట అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ భారీ ఫైట్ సీన్ కు తెరకెక్కిస్తున్నారు. అయితే అదే సమయంలో భారీ క్రేన్ విరిగిపడటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో పదికి గాయాలయ్యాయి. డైరెక్టర్ కూడా గాయపడ్డారు.

Indian film director shankar seriously injured says reports three assistant killed  Kamal Haasan

ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి క్రింద ఉన్న టెంట్‌పై పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ ఉన్నారు. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.ఈ దుర్ఘటనలో డైరెక్టర్ శంకర్‌ కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. శంకర్ సహా గాయపడిన వారందరినీ వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కమల్ హాసన్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల కమల్ కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసి తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. పలువురు సినీప్రముఖులు ఘటనా స్థలానికి వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫోన్ చేసి ఘటనపై తెలుసుకున్నట్లు సమాచారం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation