సింగర్ మధుప్రియ గురించి షాకింగ్ విషయాలు ..!

మధుప్రియ.. పరిచయం అక్కరలేని పేరు. లేలేత ప్రాయంలోనే తన చిరు గళంతో సంగీత ప్రపంచానికి దగ్గరైన ఏకైక గాయని ఎవరంటే వినిపించే పేరు మధుప్రియే! తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లలపట్ల సమాజం చూపించే చిన్నచూపుని ‘చిన్న’ వయసులోనే ముందుచూపుతో ఆలోచించి, స్వయంగా తనే అక్షరాలు కూర్చి ”ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనానీ” అంటూ ఆర్ధ్రత నిండిన గళంతో అందర్నీ ఆలోచింపజేసేలా చేసిన మధుప్రియ.. ఆనక ఆ పాటే ఆమెకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. స్థానికంగానే కాదు, ప్రవాస వేదికపైనా మధుప్రియ పాటంటే ఓ ప్రత్యేక అభిమానం. ఇంత చిన్న వయసులో అంత పేరు తెచ్చుకున్న మధుప్రియ గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

మధుప్రియ 1997లో ఆగస్టు 26న కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో జన్మించింది. మధుప్రియ తండ్రి సింగరేణి కార్మికుడిగా పని చేసేవాడు. మధుప్రియకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒక అక్క ఒక చెల్లి. అయితే మొదటి నుంచి కూడా మధుప్రియ ఎన్నో కష్టాలను అనుభవించింది. హైదరాబాద్ లోని నల్లకుంట ఏరియాలో ఒక చిన్న ఇంట్లో తన బాల్యాన్ని గడిపింది. తండ్రి సంపాదన సరిపోక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలే కావడంతో తన మీద కుటుంబం చిన్న చూపు చూసింది. ఆ ఆవేదనలోనే ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లను అనే పాట రాసి, తానె స్వయంగా పాడింది. ఈ పాట రాసినప్పుడు మధుప్రియ ఐదవ తరగతి చదువుతుంది. ఈ పాటతో మధుప్రియ లైఫ్ మొత్తం చేంజ్ అయ్యింది. ఇండస్ట్రీ నుంచే కాదు బయట జనం నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.

Singer Madhu Priya Husband and Family Latest Moments

ఆడపిల్లనమ్మా పాట తర్వాత యావత్తు ప్రపంచం మధుప్రియ పేరు మారుమోగింది. నడక సరిగ్గా రాకముందే కాళ్లకు గజ్జె కట్టి ఎన్నో ప్రదర్శనలిచ్చింది. పాట పరంగా ఎక్కవ మంది ప్యాన్స్ ను పొందిన పాట మధుప్రియ ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్ కు వెళ్లినా కూడా ఆడపిల్లనమ్మ పాట పాడమని అడగకుండా వదలరు. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా పాటలు పాడే ఛాన్స్ వచ్చింది.

మధుప్రియ పలు టీవీ పోగ్రామ్స్ లలో పాల్గొని తనకంటూ ఒక సింగర్ గా ఒక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సూపర్ సింగర్ పోగ్రామ్ తో వెలుగులోకి వచ్చింది. ఆ షో తర్వాత ఎన్నో పోగ్రామ్స్ లలో పాల్గొంది. కొన్ని సినెమాలో పాటలు పాడే ఛాన్స్ కూడా వచ్చింది. దగ్గరగా దూరంగా, ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం లాంటి సినిమాలలో పాటలు పాడింది. ఇక ఈ మధ్య వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో పాడిన పాట పెద్ద హిట్ అయ్యింది. అలాగే ప్రైవేట్ గా ఎన్నో సాంగ్స్ పాడింది. ఈమె పాడిన ప్రైవేట్ సాంగ్స్ యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చాయి. ప్రతి పండుగకు ఒక పాటను రిలీజ్ చేస్తుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొని తెలుగు ప్రజలకు మరింత దగ్గరైంది.

Image result for singer madhu priya

మధుప్రియ సింగర్ గా ఎంత సక్సెస్ అయినా కూడా ఆమె పర్సనల్ లైఫ్ లో కొన్ని వివాదాలు ఉన్నాయి. చిన్న వయసులో తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడింది. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తెలిసీ తెలియని జ్ఞానంతో భర్తపై ఆరోపణలు చేసి మీడియాలో నానా హంగామా స్పృష్టించింది.

Image result for singer madhu priya

మధుప్రియ 18 సంవత్సరాల వయసులో తన చిన్నప్పటి స్నేహితుడు శ్రీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మధుప్రియకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శ్రీకాంత్ పరిచయం అయ్యాడు. అలా చిన్న వయసులో ఏర్పడిన స్నేహం రానురాను ప్రేమగా మారింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత సంవత్సరం పూర్తికాకుండానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవపడ్డారు. నా భర్త నన్ను కొట్టాడు, హింసించాడు అని మీడియా ముందుకు వచ్చింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కానీ రెండు రోజులకే నా భర్త మంచోడు, నా తల్లిదండ్రులు నన్ను బలవంతం చేసి కేసు పెట్టించారు అని చెప్పి మళ్ళి భర్తతో కలిసిపోయింది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని, మాట్లాడుకుని, ఈ గొడవకు పులుస్టాప్ పెట్టారు. ప్రస్తుతం తల్లిదండ్రులు, భర్తతో కలిసే ఉంటుంది మధుప్రియ.

ప్రస్తుతం మధుప్రియ సింగర్ గా మంచి ఆఫర్స్ అందుకుంటుంది. అలాగే ప్రైవేట్ సాంగ్స్ తో కూడా అలరిస్తుంది. మధుప్రియ ఇలాగే మరిన్ని మంచి సాంగ్స్ పాడి మంచి సింగర్ గా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం..

Content above bottom navigation