సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ గురించి షాకింగ్ విషయాలు..!

585

జబర్దస్త్ తో ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్లలో సుడిగాలి సుదీర్ ఒకడు. ఒక మెజీషియన్ గా కెరీర్ మొదలు పెట్టి తరువాత జబర్దస్త్ కు వచ్చి మంచి కమిడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించటమే కాకుండా టివిలో అనేక షోస్ కి యాంకర్ గా పని చేస్తూ బయట ఈవెంట్స్ కి కూడా యాంకరింగ్ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. సుడిగాలి సుదీర్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సుదీర్ ఇప్పుడు ఒక స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నాడని చెప్పాలి. అయితే చాలామందికి సుదీర్ ఫ్యామిలీ గురించి, జబర్దస్త్ కు రాకముందు అతని పరిస్థితి ఏమిటి అనే విషయాల గురించి తెలీదు.. ఒక్కసారి అతని పాస్ట్ లైఫ్ లోకి వెళ్తే..

Image result for sudheer family

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడలో దేవ్ ఆనంద్ బయాన, నాగరాణి బయానాలకు జన్మించారు. ఇతని తల్లి హౌస్ వైఫ్. ఇతనిక తండ్రి దేవ్ ఆనంద్ విజయవాడలోని ఒక సినిమా ధియేటర్ లో మేనేజర్ గా పని చేసేవాడు. ఇతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. సుధీర్ తమ్ముడు పేరు రోహన్ బయానా, అక్క పేరు శ్వేత ఆనంద్ పిల్ల. రోహన్ కు పెళ్లయింది. ఇతని భార్య పేరు రమ్య బయానా. రోహన్ కూడా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు బాగానే పరిచయం. ఇతను కూడా కొన్ని షోలు చేశాడు. కొన్ని పండుగల సమయంలో చేసిన స్కిట్స్ తో ఇతను కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక సుదీర్ విషయానికి వస్తే.. సుదీర్ చదువుకోకుండా మ్యాజిక్ షోలు చేసేవాడు. ఇంటర్ ను ఆరేళ్ళు చదివాడు. ఆ తర్వాత మ్యాజిక్ ను తన కెరీర్ గా ఎంచుకున్నాడు. విజయవాడలోని సిటీ కేబుల్ ఛానల్లో ప్రశాంత్ టాలెంట్ షో లో సుధీర్ తన మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చాడు.

ఈ క్రింది వీడియో చూడండి

సుదీర్ ఇంటర్ చదివే సమయంలో మాటీవీలో ప్రసారం అయినా స్టార్ హంట్ వన్ చాన్స్ లో ప్రదర్శన ఇచ్చాడు. ఫైనల్ లో ప్రదర్శన ఇవ్వడానికి ఇంటర్ పరీక్షలు కూడా రాయలేదు. ఆబ్ తర్వాత విజయవాడలో జానపద సత్య, క్లాసిక్ డాన్స్ లను నేర్పించడం మొదలుపెట్టాడు. అనుకోని సంఘటనల వల్ల తన తండ్రి ఆక్సిడెంట్ కు గురయ్యాడు. ఈ యాక్సిడెంట్ లో సుదీర్ తండ్రికి తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే పరిస్థితుల్లో ఫ్యామిలీ మొత్తం ఆర్థిక ఇబ్బందులో పడ్డారు. అప్పుడే హైదరాబాద్ వచ్చి రామోజీ ఫిలిం సిటీలో జాబ్ చేశాడు. అక్కడ చిన్న చిన్న మ్యాజిక్ షోలు చేసి డబ్బు సంపాదించేవాడు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మించిన జబర్దస్త్ కామెడీ షో చాన్స్ కొట్టేసాడు. ఇక్కడే సుదీర్ లైఫ్ టర్న్ అయ్యింది. మొదట వేణు వండర్స్ టీమ్ లో చేశాడు. ఇతనిలో కామెడీ టైమింగ్ ఉండడంతో తర్వాత టీమ్ లీడర్ ను చేశారు. సుధీర్ బెస్ట్ ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ సన్నీతో కలిసి సుడిగాలి సుధీర్ టీమ్ ను ఏర్పాటు చేసి మంచి కామెడీ స్కిట్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బుల్లితెర మీద భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాడిగా ఎదిగాడు. హీరోగా మారి వెండితెర మీద కూడా మెరిశాడు. ప్రస్తుతం షోలు, సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation